మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ రాయలసీమ గర్జన నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైసీపీ మద్దతు పలికింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలో మూడు రాజధానుల రాజకీయం నడుస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రభుత్వం తెగేసి చెప్తోంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈరోజు కర్నూలులో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ జరగనుంది. వైసీపీ మద్దతుతో ఈ సభను నాన్ పొలిటికల్ జేఏసీ భారీ ఎత్తున నిర్వహించనుంది. కర్నూలు ఎస్టీబీసీ మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ బహిరంగ సభకు సుమారు లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.…
Andhra Pradesh: అభివృద్ధి వికేంద్రీకరణే ధ్యేయంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 5న కర్నూలు వేదికగా రాయలసీమ గర్జన జరగనుంది. ఎస్టీబీసీ గ్రౌండ్స్‌లో రాయలసీమ గర్జనను భారీగా నిర్వహించాలని నాన్ పొలిటికల్ జేఏసీ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టు…
ఏపీలో మూడురాజధానుల అంశం ఎప్పుడైనా హాట్ టాపిక్. విశాఖలో పాలనా రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని అంటూ అప్పటివరకూ వున్న అమరావతి రాజధానిని వికేంద్రీకరించాలని ప్రభుత్వం భావించింది. అయితే న్యాయపరమయిన ఇబ్బందుల నేపథ్యంలో బిల్లుని వెనక్కి తీసుకుంది. సమగ్రమయిన విధానంతో, ఎలాంటి న్యాయపరమయిన చిక్కులు లేకుండా వుండేలా మూడురాజధానుల బిల్లు తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. మూడు రాజధానులనేది ఇక రాజకీయ నివాదంగానే ఉంటుందన్నారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవిఎల్ నరసింహారావు. మూడు రాజధానుల…