ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయింపు చేసింది ప్రభుత్వం.
భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల నిబంధనలు సులభతరం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ బిల్డింగ్ రూల్స్ -2017, ఏపీ ల్యాండ్ డెవలప్మెంట్ రూల్స్-2017 లో సవరణలు చేస్తూ వేరు వేరుగా జీవోలు జారీ చేసింది.
భవన నిర్మాణాలు, లేఅవుట్లకు ఆన్ లైన్‌లో అనుమతులు జారీ చేసే పోర్టల్‌లో మార్పులు చేస్తోంది ప్రభుత్వం. ఈ మార్పుల్లో భాగంగా పలు రోజుల పాటు ఆన్‌లైన్ అనుమతుల సేవలు నిలిపివేస్తున్నట్లు పట్టణ ప్రణాళికా విభాగం డైరెక్టర్ విద్యుల్లత ఒక ప్రకటనలో తెలిపారు.
భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ, ఏపీ రేరా అనుమతులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది.. అన్ని రకాల ఫీజులు చెల్లించి, సరైన డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల తక్షణ పరిష్కారానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్ణయం తీసుకున్నారు.
HMDA: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) సమీపంలోని బాచుపల్లి లేఅవుట్ లో ప్లాట్లను కొనుగోలు చేసే అంశంపై ప్రజలను పక్కదారి పట్టిస్తున్న ఒక సంస్థ సీఈఓ పై హెచ్ఎండీఏ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు పై బాచుపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అనధికార లేఅవుట్ల ప్లాట్లను షరతులతో రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తూ 2020లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో 5 వేలకు పైగా పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వేల సంఖ్యలో పిటిషన్లు వస్తున్నందున హై కోర్టలు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. షరతులతో కూడిన రిజిస్ట్రేషన్లు చేయాలని సబ్…