కర్ణాటకలో కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ర్ట శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన భూమిక ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న డీకే శివకుమార్‌ది. కర్ణాటక గెలుపులో డీకేతోపాటు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య పాత్ర కూడా ఉంది.
కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ నిష్క్రమణ కాంగ్రెస్ పార్టీ, దాని న్యాయ బృందం (లీగల్ టీమ్)కు పెద్ద దెబ్బ. విజయవంతమైన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ కపిల్ సిబల్ బుధవారం కాంగ్రెస్ పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. అనేక న్యాయ పోరాటాలలో గత ముప్పయ్ ఏళ్లుగా ఆయన పార్టీకి బలమైన గొంతుకగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం సుప్రీంకోర్టులో చురుకైన పాత్ర పోషించారు. పౌరసత్వ(సవరణ) చట్టం, గోప్యత హక్కు, మరాఠా కోటా, జహంగీర్‌పురి కూల్చివేత వంటి…
కర్ణాటకలో ప్రకంపనలు సృష్టించిన హిజాబ్ వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. విద్యాలయాల్లోకి హిజాబ్‌ను అనుమతించేది లేదన్న ఉడుపి విద్యా సంస్థ ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో తమకు న్యాయం జరగలేదని పిటిషనర్లు ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, కర్ణాటకకు చెందిన ముస్లిం…
కోర్టులోనే దారుణం జరిగింది.. ఓ లాయర్ ను నాటు తుపాకితో కాల్చి చంపారు దుండగులు… ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. పూర్తి వివరాల లోకి వెళ్తే షాహజన్‌పూర్ జిల్లా కోర్టులో భూపేంద్ర ప్రతాప్ సింగ్ అనే లాయర్‌ను కోర్టు లోపలే కాల్చి చంపారు. ఆయన మృతదేహం పక్కన దేశీయంగా తయారు చేసిన నాటు తుపాకీ దొరికినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఘటన అనంతరం కోర్టులో భారీగా పోలీసులు మోహరించారు. అయితే పోలీసు భద్రతా లోపం వల్లే…
‘సూరరై పోట్రు’తో మరోసారి బౌన్స్ బ్యాక్ అయిన సూర్య మంచి జోష్ లో ఉన్నాడు. కెరీర్ మొదట్నుంచీ ప్రయోగాలకు సై అనే టాలెంటెడ్ హీరో ఈసారి గిరిజన మహిళలపై దృష్టి పెట్టాడట. ‘జై భీమ్’ పేరుతో ఆయన నటిస్తోన్న సినిమాలో 1993 నాటి యదార్థ సంఘటనలు తెరపై కనిపించబోతున్నాయట. చంద్రు అనే లాయర్ చేసిన న్యాయ పోరాటం, దాని వల్ల అమాయక, పేద గిరిజన మహిళలకు కలిగిన లాభం సినిమాలో ప్రధానంగా చూపించబోతున్నారట. ‘సూరరై పోట్రు’ కూడా…
ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. అశ్లీల ఫిల్మ్ రాకెట్‌కు సంబంధించి అరెస్టయిన వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను జూలై 23 వరకు రిమాండ్‌కు తరలించారు. ఆయనపై ఇప్పటికే బలమైన పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ప్రస్తుతం ఆయన పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈరోజు ఆయన కేసుకు సంబంధించి కోర్టులో జరిగిన విచారణలో ఆయన తరపు లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అశ్లీల సన్నివేశాలు ఉన్నంత మాత్రాన ప్రతిదీ…
బీ-టౌన్ బ్యూటీస్ లో రాధికా ఆప్టే రూటు కాస్త సపరేటు! తెలుగులోనూ ప్రేక్షకుల్ని అలరించిన మరాఠీ బ్యూటీ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ కాదు. అలాగని అందానికి, గ్లామర్ కి కొదవేం ఉండదు. అయినా, రాధికా ఆప్టే ఓ సినిమాకి సై అనాలి అంటే అందులో ఎంతో కొంత ప్రత్యేకత ఉండాల్సిందే. తనకు నచ్చితేనే సినిమాలు, ఓటీటీ షోలు చేసే టాలెంటెడ్ బ్యూటీ లెటెస్ట్ గా మరో చిత్రానికి అంగీకారం తెలిపిందట! Read Also: అనుష్క, భూమి పెడ్నేకర్…