CJI DY Chandrachud: న్యాయశాఖ, ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం కొలీజియం వ్యవస్థపై అసహనం వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు పలు కార్యనిర్వహాక వ్యవస్థ నియామకాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడంతో ఇరు వ్యవస్థల మధ్య ఉద్రిక్తత ఏర్పడుతోంది. అయితే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థను సమర్థిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఇండియా కాంక్లేవ్, 2023 కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉండాలంటే బయటి ప్రభావాల నుంచి రక్షించబడాలని…
Kiren Rijiju: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రిటైర్డ్ జడ్జిలు భారతదేశ వ్యతిరేక ముఠాలో చేరారని అన్నారు. వారు న్యాయవ్యవస్థను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దేశానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు మూల్యం చెల్లించుకోక తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇండియా టుడే కాంక్లేవ్ 2023లో మాట్లాడుతూ కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థ మధ్య క్లియర్ గా రాజ్యాంగంలో విభజన ఉందని గుర్తు చేశారు. ఇటీవల న్యాయమూర్తుల జవాబుదారీతనంపై ఒక సెమినార్ జరిగింది.…
Law Minister Kiren Rijiju: భారత న్యాయవ్యవస్థ, ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉన్నాయని ప్రపంచానికి తప్పుగా చాటి చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరన్ రిజిజు అన్నారు. శనివారం తూర్పు రాష్ట్రాల్లోని కేంద్ర న్యాయవాదుల సదస్సును ప్రారంభిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల విజ్ఞత ప్రజల పరిశీలనకు మించినదని ఆయన అన్నారు. భారత న్యాయవ్యవస్థను ప్రశ్నించలేమని, ముఖ్యంగా న్యాయమూర్తుల విజ్ఞతను ప్రజల పరిశీలనలో ఉంచలేమని వ్యాఖ్యానించారు.
Kiren Rijiju comments on pending cases: దేశంలో పెరుగుతున్న కేసులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది న్యాయమూర్తుల తప్పు కాదని.. వ్యవస్థ తప్పు అని ఆయన అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలను చేస్తోందని అన్నారు. అనవసరమైన, వాడుకలోని చట్టాలను రద్దు చేయడం, కోర్టులో మౌళిక సదుపాయాలను మెరుగుపరచడం, సాంకేతికను వాడటం వంటివి చేస్తూ మెరుగైన వ్యవస్థ వైపే వెళ్తున్నామని అన్నారు.
"Public Is The Master...": Law Minister's Latest Swipe At Supreme Court: కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు మధ్య కొన్ని రోజులుగా పంచాయతీ నెలకొంది. సుప్రీంకోర్టు కోలిజియం సిఫారసు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పదోన్నతుల వ్యవహారం గత రెండు నెలలుగా కేంద్రం పెండింగ్ లో ఉంచింది. అయితే నిన్న సుప్రీంకోర్టు దీనిపై ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. తాజాగా ఈ రోజు కేంద్రం రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంకజ్ మిథాల్, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి…
భారతదేశంలోని న్యాయస్థానాల్లో దాదాపు 5 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. భారతదేశంలోని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు ఐదు కోట్ల మార్కుకు చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం తరఫున న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో వెల్లడించారు.