ప్రధాని మోడీ శుక్రవారం పలు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు బీహార్. ఒడిశాలో మోడీ పర్యటించనున్నారు. రూ.18,600 కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇక బీహార్ నుంచి గినియాకు మొట్టమొదటి సారిగా లోకోమోటివ్ ఎగుమతిని ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు.