విదేశీ గడ్డపై భారత జట్టు మరోసారి చరిత్ర సృష్టించింది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచకప్ 2024 టైటిల్‌ను గెలుచుకుంది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత టీమిండియాకు అభినందనలు తెలిపే ప్రక్రియ మొదలైంది.
ఈ మధ్య బ్యాంకులు కొత్త నిబంధనలను తీసుకొస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ బ్యాంక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డ్ పాయింట్స్ ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రెడిట్ కార్డుల ద్వారా ప్రభుత్వ లావాదేవీలు జరిపితే రివార్డ్ పాయింట్స్ వర్తించవని యూజర్స్ కి షాకింగ్ న్యూస్ చెప్పింది.
భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రులు ఆర్మీ, నేవీకి చీఫ్ లుగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.. అడ్మిరల్ దినేష్ త్రిపాఠి అనే ఇద్దరు సహవిద్యార్థులు భారత సైన్యం నావికాదళానికి చీఫ్‌లుగా నియమితులయ్యారు.
పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ కమర్షియల్ మొబిలిటీ.. సౌరశక్తితో నడిచే కారును రూపొందించింది. ఈ కారు పేరు వేవే CT5 సోలార్ కార్. దీని కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ కారు దేశంలోనే తయారు చేయబడిన మొట్టమొదటి సోలార్ కారు.
ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమ్‌లకు వ్యసనంగా మారి ఓ యువకుడు తన అమ్మమ్మన్ను హత్య చేశాడు. ఈ ఘటన ఘజియాబాద్‌లోని సాహిబాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
న్యాయవ్యవస్థ నిష్పక్షపాతంగా, నిజాయితీగా, స్వచ్ఛంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం అన్నారు. పశ్చిమ బెంగాల్ లో జరిగిన నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ ప్రాంతీయ సదస్సులో బెనర్జీ ప్రసంగిస్తూ.. “పశ్చిమ బెంగాల్‌లో 88 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి.
బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారతీయురాలు సునీతా విలియమ్స్ ఇంకా కొంత కాలం పాటు అక్కడే ఉండాల్సి రావచ్చు. ఈ మిషన్ ను రూపొందించినప్పుడు తక్కువ రోజులే ఉంటుందని వెల్లడించారు.
మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. విచారణ సందర్భంగా.. కేజ్రీవాల్‌ను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. దానిని కోర్టు అంగీకరించింది.
కర్ణాటకలో రాజకీయ దుమారం ఊపందుకుంది. ముఖ్యమంత్రిని మార్చే అవకాశం, మరో ముగ్గురు ఉపముఖ్యమంత్రుల డిమాండ్‌పై జరుగుతున్న చర్చల మధ్య.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ శనివారం పార్టీ కార్యకర్తలు, నాయకులను ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు జారీ చేయవద్దని కోరారు.
శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన అంతరాయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను ప్రభావితం చేసింది. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ అంశం ప్రకంపనలు సృష్టించింది. ఆన్‌లైన్ అంతరాయాలను పర్యవేక్షించే వెబ్సైట్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. భారతదేశంలోని వేలాది మంది వినియోగదారులు మధ్యాహ్నం 12:02 గంటలకు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.