పార్లమెంట్ సమావేశాల ఐదో రోజైన శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలో దేవి నేతమ్ ఆరోగ్యం క్షీణించింది. ఫూలో దేవిని వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై విపక్షాలు సభలో నిరసన తెలుపుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు భారతీయ రైల్వే కూడా ప్రభుత్వానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టర్ 2030 నాటికి గ్రీన్ రైల్వేను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చేరిన ఎలాన్ మస్క్ 53వ పుట్టినరోజు నేడు. ఎలాన్ మస్క్ కు తన పుట్టిన రోజున షాక్ తగిలింది. మరోసారి ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మస్క్ ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయారు.
కాంగ్రెస్ ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుందని..కాంగ్రెస్ పార్టీ ఆలస్యం చేయడం వల్ల తెలంగాణ కోసం 1200 మంది చనిపోయారని రాజ్యసభ సభ్యుడు డా. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ సిటీ ఆఫీస్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినం నిర్వహించారు.
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
రాష్ట్రంలోని అక్రిడేటెడ్ జర్నలిస్టుల రాయితీ బస్ పాసుల గడువును తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) పొడిగించింది. ప్రస్తుత బస్ పాస్‌ల గడువు ఈ నెల 30తో ముగుస్తోంది. తాజాగా సెప్టెంబర్ 30 వరకు మూడు నెలల పాటు జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కాలపరిమితిని పొడిగిస్తూ తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మారకద్రవ్యాల రవాణాలో ఎంతటి పెద్దవారు ఉన్న ఉపేక్షించమని, ఉక్కు పాదంతో అణచివేస్తామన్నారు.
కొంపల్లి లోని శ్రీ చైతన్య స్కూల్ అండ్ హాస్టల్స్ లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్ 7 వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి మృతి చెందాడు.
నిర్భయ వంటి చట్టాలు ఎన్ని ఉన్నా.. ఎన్ కౌంటర్ లు ఎన్ని జరుగుతున్నా.. మృగాళ్ల వైఖరిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు క్రమంగా పెరుగుతున్నాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న ఇద్దరు కేంద్ర మంత్రులను సీఎం కలిశారు. ఇవాళ కేంద్ర మంత్రి జేపీ నడ్డా తో సమావేశం కానున్నారు.