Home
Latest Telugu News
Latest Telugu News News
-
Sajjala: వైఎస్ వివేకా హత్య కేసులో దుష్ప్రచారం చేస్తున్నారు: సజ్జల
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. 2019 ఎన్నికలకు ముందు జరిగిన వివేకా హత్య సీఎం జగన్‌ను ఎంతో కుంగదీసిందని ఆయన పేర్కొన్నారు. వివేకా హత్యపై కొన్ని మీడియా సంస్థలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని సజ్జల మండిపడ్డారు. సీబీఐ ఛార్జ్‌షీట్ పేరుతో కేసుతో సంబంధం లేని వారిపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ఒక పథకం ప్రకారం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ… -
Pawan Kalyan: గౌతమ్ సవాంగ్‌ను ఎందుకు తప్పించారు?: పవన్ కళ్యాణ్
ఏపీ డీజీపీగా గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు మధ్యాహ్నం వరకు విధుల్లో ఉన్న గౌతమ్ సవాంగ్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బాధ్యతల నుంచి తప్పించడం తనకు విస్మయం కలిగించిందన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కావొచ్చు… కానీ వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరమేంటని పవన్ ప్రశ్నించారు. గౌతమ్ సవాంగ్ బదిలీపై గల కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.… -
Harish Rao: కిషన్‌రెడ్డికి దమ్ముంటే ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా తీసుకురావాలి
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేదని హరీష్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుతున్న భాషనే కేసీఆర్ ఈరోజు మాట్లాడుతున్నారని.. తెలంగాణ ప్రజల భాషనే కేసీఆర్ మాట్లాడతారని తెలిపారు. బీజేపీ నేతలదే మతాల మధ్య చిచ్చు పెట్టేలా భాష అని ఆరోపించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారని హరీష్‌రావు… -
BCCI: భారత్-శ్రీలంక సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు
ఈనెలాఖరులో భారత్‌లో శ్రీలంక జట్టు పర్యటించనుంది. ఈ మేరకు టీమిండియాతో మూడు టీ20లతో పాటు రెండు టెస్టులను శ్రీలంక ఆడనుంది. అయితే తొలుత షెడ్యూల్ ప్రకారం తొలుత టెస్టులు, తర్వాత టీ20లు జరగాల్సి ఉంది. కానీ సవరించిన షెడ్యూల్ ప్రకారం ముందుగా టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టులు నిర్వహించనున్నారు. ఈ మేరకు సవరించిన షెడ్యూల్‌ను మంగళవారం నాడు బీసీసీఐ ప్రకటించింది. ఫిబ్రవరి 24న తొలి టీ20, ఫిబ్రవరి 26న… -
FIR: రవితేజతో కలిసి విష్ణు విశాల్ ద్విభాషా చిత్రం
టాలెంటెడ్ యాక్టర్ విష్ణు విశాల్ నటించిన ‘ఎఫ్.ఐ.ఆర్.’ మూవీ గత శుక్రవారం తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ సంస్థ తెలుగులో పంపిణీ చేసింది. ఈ చిత్రానికి మాస్ మహరాజా రవితేజ సమర్పకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాకు తమిళంలో మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, తెలుగులోనూ ఆదరణ బాగుందని విష్ణు విశాల్ మంగళవారం మీడియాతో తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ తర్వాత థియేటర్ల ఓనర్స్, పంపిణీ దారులు ఈ… -
Kodali Nani: హోదా తాకట్టు పెట్టి ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. దొంగే దొంగ అంటే ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉంటాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్న దుర్మార్గుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ప్యాకేజీ వద్దు ప్రత్యేక హోదానే కావాలని ఉద్యమం చేసిన వ్యక్తి జగన్ అని కొనియాడారు. జీవీఎల్ నరసింహారావు పక్క రాష్ట్రంలో ఎంపీ పదవి తెచ్చుకున్న వ్యక్తి అని.. పదిహేను రోజులకు… -
Pawan Kalyan: మేడారం జాతరపై ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్
తెలంగాణలో బుధవారం నుంచి మేడారం జాతర ప్రారంభమవుతున్న సందర్భంగా అడవి తల్లి బిడ్డలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ ట్వీట్ చేశారు. బుధవారం మొదలవుతున్న సమ్మక్క-సారలమ్మ జాతర భారతీయ సనాతన ధార్మిక విశిష్టతకు నిలువెత్తు నిదర్శనం అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ దేవతలు అడవి బిడ్డల వీరత్వానికి ప్రతీకలు అని అభివర్ణించారు. దేశం నలుమూలల ఉన్న గిరిజనులు, గిరిజనేతరులు తమ ఇలవేల్పులుగా పూజిస్తున్న ఈ శక్తి స్వరూపిణీల… -
Actor Ali: వైసీపీ రాజ్యసభ ఎంపీగా అలీ.. రెండు వారాల్లో ప్రకటన?
టాలీవుడ్ సీనియర్ కమెడియన్ అలీ మంగళవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అలీ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పిలుపు మేరకే తాను ఈరోజు ఆయనతో సమావేశం అయ్యానని తెలిపారు. పదవుల కోసం రాలేదని స్పష్టం చేశారు. అయితే త్వరలో పార్టీ ఆఫీసు నుంచి తనకు సంబంధించి ప్రకటన ఉంటుందని అలీ తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో తనకు పాత పరిచయం ఉందని.. వైసీపీ పార్టీ కోసం తాను కష్టపడి… -
Devegowda: సీఎం కేసీఆర్‌కు మద్దతు ప్రకటించిన మాజీ ప్రధాని
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మాజీ ప్రధాని, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఫోన్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కేసీఆర్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు కేసీఆర్‌ను దేవెగౌడ అభినందించారు. దేశాన్ని కాపాడుకునేందుకు తమ వంతుగా సంపూర్ణ సహకారం అందిస్తామని.. కేసీఆర్ పోరాటం కొనసాగించాలని దేవెగౌడ ఆకాంక్షించారు. కాగా తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమవుతానని దేవేగౌడకు సీఎం కేసీఆర్ తెలిపారు. కాగా హుజురాబాద్… -
Manchu Vishnu: జగన్ నాకు ‘బావ’ అవుతారు.. కానీ ‘అన్న’ అని పిలుస్తా
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినీ రంగ సమస్యలపై జగన్‌తో చాలా విషయాలు చర్చించానని.. కానీ అవి ఇప్పుడు చెప్పనని.. సరైన వేదికపై మాట్లాడతానని తెలిపారు. విశాఖకు సినీ ఇండస్ట్రీని తరలించే విషయంపై అందరం సమావేశమై చర్చిస్తామని మంచు విష్ణు పేర్కొన్నారు. జగన్ తనకు వరుసకు బావ అయినా అన్న అని పిలుస్తానని ఆయన చెప్పారు. అటు…
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!