ఏపీ అసెంబ్లీలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంపై సీఎం జగన్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కోసం దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి కన్న కలలను తాము సాకారం చేస్తామని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి గౌతమ్‌రెడ్డి పేరు పెట్టి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ప్రకటించారు. తన సహచరుడు, మిత్రుడు మేకపాటి గౌతమ్ రెడ్డి లేడని ఊహించడం కష్టంగా ఉందని.. గౌతమ్…
ఏపీలో పోలీసులపై మాజీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో ఉన్నది పోలీసులా లేదా వైసీపీ రౌడీషీటర్లకు అనుచరులా అనే అనుమానాలు నెలకొన్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే నేరంగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త కోన వెంకటరావును వేధించి ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసులు కారణమయ్యారని లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు…
తమిళనాడు మంత్రి శేఖర్‌బాబు కుమార్తె జయకళ్యాణి ప్రేమ వివాహం చేసుకుంది. బెంగళూరులోని హిందూ ధార్మిక సంస్థలో సోమవారం నాడు సతీష్అనే యువకుడితో మంత్రి కుమార్తె వివాహం జరిగింది. తమ ప్రేమకు ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇలా ప్రేమ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని జయకళ్యాణి వివరణ ఇచ్చింది. అయితే తన తండ్రి నుంచి తమకు ప్రాణ హాని ఉందని ఆమెతో పాటు ఆమె భర్త సతీష్ పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. కొన్ని నెలల క్రితం…
సిద్దార్థ్ శుక్లా.. పునీత్ రాజ్‌కుమార్.. ఏపీ మంత్రి గౌతం రెడ్డి.. తాజాగా షేన్ వార్న్.. వీళ్లే కాదు ఇలా ఎందరో.. ఫిట్‌నెస్ కోసం శ్రమించి… ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్లే. అయితే.. వీళ్ల మరణాలు ఏం చెప్తున్నాయి? జిమ్ చేయడం తప్పా? అతిగా శ్రమిస్తే.. హార్ట్ ఎటాక్ తప్పదా? ఎక్సర్‌సైజ్ చేస్తే.. ఆరోగ్యానికి మంచిదంటారు. మరి వీళ్ల ప్రాణాల మీదకు ఎందుకొచ్చింది? ఫిట్‌గా ఉండేందుకు రకరకాలుగా శ్రమిస్తున్న ప్రతి ఒక్కరిని కలవరపెడుతున్న సమస్య ఇదే. గుండె పదిలంగా…
ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి శాంతించింది. ప్రస్తుతం రోజువారీ 5వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కొవిడ్ కేసులను సున్నాకు తేవాలనే చైనా ప్రయత్నాలను కరోనా వమ్ము చేస్తోంది. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 2020 మార్చి తర్వాత గత రెండు రోజులుగా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. చైనాలో ఆదివారం 312 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం మరో 214 కరోనా పాజిటివ్…
తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు వనపర్తి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలలో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి వనపర్తికి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. వనపర్తి వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు ఉదయం 11:45 గంటలకు చేరుకుంటారు. అక్కడే అగ్రికల్చర్ మార్కెట్ యార్డును ప్రారంభిస్తారు. అనంతరం రోడ్డుమార్గంలో వనపర్తిలోని జడ్పీ ఉన్నత పాఠశాలకు చేరుకుని ‘మనఊరు – మనబడి, మనబస్తీ…
ఏపీలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బుల చెల్లింపుల కోసం ప్రవేశపెట్టిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం వాయిదా పడింది. గతంలో ప్రకటించిన దాని ప్రకారం ఇవాళ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల డబ్బులు జమ చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఈ పథకం వాయిదా పడటంతో ఈ రోజు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు పడే అవకాశాలు లేవు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు తెలంగాణ ఆర్టీసీ నజరానా ప్రకటించింది. ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా మహిళల కోసం పలు ఆఫర్లను కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లకు పైబడిన మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఈ అవకాశం ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుందని తెలిపారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. హైదరాబాద్…
★ నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం★ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు మహిళా ఉద్యోగులకు క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ జీవో జారీ చేసిన ఏపీ ప్రభుత్వం★ ఢిల్లీ: మహిళా దినోత్సవం సందర్భంగా నేడు నారీ శక్తి అవార్డుల ప్రదానం.. అవార్డులు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి అవార్డులు★ నేడు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మహిళా దినోత్సవ…
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నాడు. శ్రీలంకతో ఈనెల 12 నుంచి బెంగళూరు వేదికగా జరిగే రెండో టెస్టు ద్వారా రోహిత్ తన కెరీర్లో 400వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 44 టెస్టులు, 230 వన్డేలు, 125 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ మొదట్లో వరుసగా విఫలం కావడంతో జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. 2013లో ఓపెనర్ అవతారం ఎత్తినప్పటి నుంచి తిరుగులేకుండా దూసుకెళ్తున్నాడు.…