సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. మీడియా, వినోద రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇది 25 బిలియన్ డాలర్ల పరిశ్రమ అని, వచ్చే రెండేళ్లలో 30 బిలియన్ డాలర్లుగా మారుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందనను తీసుకురావడానికి పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. త్వరలో ప్రభుత్వ ప్రధానమైన ‘జాతీయ సింగిల్…
ఇటీవల రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 148 మంది యువతి యువకులను పట్టుకున్న ఘటన ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాద్ లోని రాడిసిన్ బ్లూ ప్లాజా హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ లో మత్తు మందులు స్వాధీనం చేసుకున్న సంఘటన పై…
ఇటీవల రాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ పబ్ లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలతో సహా 148 మంది యువతి, యవకులు పట్టుబడ్డారు. అయితే ఇందులో కొందరు డ్రగ్స్ తీసుకన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందిస్తూ.. కాంగ్రెస్, బీజేపీ నేతల సన్నిహితులే ఈ ఘటనలో ఉన్నారని ఆరోపించారు. అంతేకాకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ.. రేవంత్…
నిలోఫర్, గాంధీ వైద్యులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. విభాగాల వారీగా నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన వైద్యాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బడ్జెట్ పెరిగింది.. పనితీరు పెరగాలని ఆయన అన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులకు, వైద్యులకు అదేశించారు. అంతేకాకుండా నవజాత శిశువుల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన సూచించారు. మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలు పెరగాలని…
రోజురోజుకు కొత్తకొత్త టెక్నాలజీలతో, కొత్తకొత్త ఆలోచనలతో జపాన్ లాంటి దేశాలు ముందున్నాయి. అందుకు కారణం అక్కడి విద్యా విధానం. అయితే టెక్నాలజీలో ముందున్న దేశాల పక్కన మన భారతదేశాన్ని నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇందుకు విద్యా విధానంలో మార్పుల తప్పనిసరి. అందుకు అనుగుణంగా రాష్ట్రాలు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు అడుగులు వేయాలి. ఈ విధంగా ముందుకు వెళ్లేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలు చేస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం…
ప్రతి సంవత్సరం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పలలో పిడకల సమరం ఆనవాయితీగా వస్తోంది. ప్రేమికులైన వీరభద్రస్వామి, కాళికాదేవిని ఒక్కటి చేసేందుకు రెండు వర్గాలు పిడకలతో హోరాహోరీగా పోరాడి, పిడకల సమరం అనంతరం పంచాయతీ జరిపి స్వామి అమ్మవార్లను ఒక్కటి చేయడం జరుగుతుంది. సుధీర్ఘ చరిత్ర ఉన్న ఈ పిడకల యుద్ధాన్ని ప్రతి ఏటా ఉగాది మురుసటి రోజు దీన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కైరుప్పలలో పిడకల సమరం ఘనంగా జరుపుకున్నారు. గ్రామస్థులు రెండువర్గాలుగా విడిపోయి పిడకలతో…
డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరించిపోతుంది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీక వరకూ ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్, గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెల్లోకి కూడా విస్తరించి పోయింది. 15 ఏళ్ళ వయసులోనే గంజాయికి ఎడిక్ట్ అవుతోంది యువత. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన 15 ఏళ్ళ కొడుక్కి ఘాటు ట్రీట్మెంట్ ఇచ్చింది ఓ తల్లి. చిన్న తనంలో గంజాయికి బానిసైన కొడుక్కి అలవాటు మార్చుకోవాలని హెచ్చరించింది.…
తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ముస్లింలకు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2 నుంచి మే2 వరకు రంజాన్ ఉపవాసాలు జరుగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ వెలుసుబాటు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.…
జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు వరించింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలీహిమ్ పాల్గొని మొక్కలు నాటారు. “ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా దేశవిదేశాల్లో…
ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 13 నుండి అత్యంత పవిత్రమైన ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఏపీ…