Rajasthan: రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
- రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ బీభత్సం
- దుమ్ము మేఘాలతో కప్పుకుపోయిన పలు నగరాలు
- బెంబేలెత్తిపోయిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లో అకస్మాత్తుగా తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో 127 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. నిమిషాల వ్యవధిలో పెద్ద ఎత్తున భారీ నష్టం కలిగించింది. సేమ్ అదే రీతిగా రాజస్థాన్‌లో కూడా శనివారం పట్టపగలు ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ ఈదురుగాలుల మధ్య ఇసుక తుఫాన్ హడలెత్తించడంతో ఇళ్లల్లోకి ఇసుక రావడంతో ప్రజలకు కంటి చూపు కనిపించక అల్లాడిపోయారు. ఇక రహదారులైతే ధూళితో నిండిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఇక ఇసుక తుఫాన్ అనంతరం భారీ వర్షం కురుస్తోంది. అకస్మాత్తుగా సంభవించిన భారీ తుఫాన్‌తో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ఎవరైనా చనిపోయారా? లేదంటే గాయపడ్డారా? అన్నది ఇంకా తెలియలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా శ్రీ గంగానగర్‌ను దుమ్ము మేఘాలు కమ్మేశాయి. అలాగే బికనీర్‌లో కూడా భారీ ధూళి ప్రకంపనలు సృష్టించింది. ఒక్కసారిగా వేగంగా వీచిన ఈదురుగాలులతో పెద్ద ఎత్తున ధూళి గాలిలోకి ఎగసిపడడంతో నగరమంతా దుమ్ము మేఘాలతో కప్పుకుపోయింది. పలు ప్రాంతాల్లో దృశ్యమానత గణనీయంగా తగ్గిపోయింది. రహదారులపై ప్రయాణిస్తున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల వాహనాలు హెడ్లైట్లు వెలిగించుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
- LoC Infiltration Bid in Poonch: LoC వద్ద చొరబడేందుకు యత్నం.. ల్యాండ్‌మైన్ పేలుడులో నలుగురు ఉగ్రవాదులు మృతి?
- Rahul Gandhi's SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
- India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని బలమైన గాలులు వీచాయి. అనంతరం భారీగా ధూళి ఎగసిపడుతూ ఆకాశాన్ని పూర్తిగా కమ్మేసింది. దీంతో ప్రజలు ఇళ్లలోనే బయటకు రాలేదు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ధూళి తుఫాన్ల సమయంలో అనవసర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బయటకు వెళ్లేటప్పుడు తగిన రక్షణ చర్యలు పాటించాలని సూచించారు.
#WATCH | Rajasthan: A storm kicks up a wall of dust in Sri Ganganagar, this afternoon. pic.twitter.com/XDL1EmHYV6
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 30, 2026
#WATCH | Rajasthan: A severe storm kicked up a massive wall of dust in Bikaner this afternoon. pic.twitter.com/qc9DiZwL3c
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 30, 2026
#WATCH | Haryana | Rain lashes parts of Karnal city pic.twitter.com/qZw4s4z67E
— ANI (@ANI) May 30, 2026
#WATCH | Rajasthan: A storm kicked up a wall of dust in Churu this afternoon. It was followed by rainfall here. pic.twitter.com/u1EGE2wxWW
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 30, 2026
తాజావార్తలు
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?