IMD Warning: తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
- ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. అకస్మాత్తుగా సంభవించే తుఫానులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో అల్లాడిపోతున్నారు. తాజాగా శనివారం రాజస్థాన్‌లో ఇసుక తుఫాన్ హడలెత్తించింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు.
ఇదిలా ఉంటే వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని వాయువ్య భారత ప్రాంతాలను వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ప్రభావితం చేస్తుందని భారత వాతావరణ శాఖ (IMD) ముందుగానే అంచనా వేసిందని ఐఎండీ శాస్త్రవేత్త అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. గత రెండు నుంచి మూడు రోజులుగా మైదాన ప్రాంతాలు, తూర్పు భారతదేశం, మధ్య భారత ప్రాంతాల్లో నిరంతర ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని… దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని వెల్లడించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ఆయా వాతావరణ విభాగాలకు హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు.
అదే విధంగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాల్లో కూడా ఉరుములు, వడగళ్ల వానలు సంభవించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇక దక్షిణ పశ్చిమ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అలాగే రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు సాగనున్నట్లు అఖిల్ శ్రీవాస్తవ తెలిపారు.
#WATCH | Delhi | IMD scientist Akhil Srivastava says, "The IMD had already predicted that a Western Disturbance would affect northwest India and cause a significant drop in maximum temperatures. For the past two to three days, there have been continuous thunderstorms in the… pic.twitter.com/NmQ2DLKvIi
— ANI (@ANI) May 30, 2026
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!