ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యానికి, ముఖ్యంగా జుట్టు రాలడాన్ని నివారించేందుకు ఒక ప్రసిద్ధ ఔషధంలా పనిచేస్తుంది. ఇది జుట్టులోని చుండ్రును తగ్గిస్తుంది. జుట్టు మెరుగవడానికి దశాబ్దాలుగా ఇంట్లోని ఉల్లిరసాన్ని ఉపయోగిస్తున్నారు.
హిందువుల ప్రధాన పుణ్యక్షేత్రాలలో ఒకటైన అమర్‌నాథ్ గుహలో శనివారం 'మొదటి పూజ' జరిగింది. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (SASB) చైర్మన్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తన అధికారిక పోస్ట్‌లో పోస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత పర్యటనలో ఉన్నారు. షేక్ హసీనాతో చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్, బంగ్లాదేశ్‌లు అంగీకరించాయని, మొత్తం సంబంధాలను పెంపొందించేందుకు భవిష్యత్తు దృష్టిని రూపొందించుకున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, ఆ దేశంతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త రంగాలలో భారతదేశం-బంగ్లాదేశ్ సహకారానికి భవిష్యత్తు దార్శనికత సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్…
ఉత్తర కాశ్మీర్ బారాముల్లా జిల్లా ఉరీలోని గోహ్లాన్ ప్రాంతంలో ఉగ్రవాద చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా బలగాలు భగ్నం చేశాయి. ఉరీ సెక్టార్‌లోని ఎల్‌ఓసి సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు సమాచారం.
వర్షాకాలం ప్రారంభం కానప్పటికీ.. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్ల వర్షం మొదలైంది. మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్ అమెజాన్‌లో కొనసాగుతోంది. ఇందులో చాలా స్మార్ట్‌ఫోన్‌లలో బంపర్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
వర్షాకాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయంలో సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, ఫ్లూ, టైఫాయిడ్, మలేరియా డెంగ్యూ వంటి సమస్యలు వస్తాయి. వీటిలో కొన్ని దోమల ద్వారా వస్తాయి.
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ కంపెనీ ఎన్‌విడియా కార్పొరేషన్ ప్రంపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, ఆపిల్ ను వెనక్కి నెట్టి మార్కెట్ విలువ పరంగా నంబర్ వన్ గా నిలిచింది. ఆర్టిఫీషియల్ ఇంటెలెజిన్స్ చిప్స్ తయారు చేసే ఈ కంపెనీ షేర్లు కొద్ది రోజులుగా తారా స్థాయికి చేరుకున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ కొనసాగుతోంది. న్యాయమూర్తులు సుధీర్ కుమార్ జైన్, రవీందర్ దూదేజాలతో కూడిన వెకేషన్ బెంచ్ ఈ కేసును విచారిస్తోంది.
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ తన కస్టమర్ల కోసం అనేక ఆప్షన్లను అందిస్తోంది. వీటిలో వీడియో మరియు ఆడియో కాలింగ్ కూడా ఒకటి. కాలింగ్ అనేది వాట్సప్ యొక్క ప్రత్యేక లక్షణం.