ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు ఫ్యామిలీ ఓ నాయిబ్రాహ్మణుడికి అన్యాయం చేశారంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు తిరుపతిలో నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయిబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మీడియాలో వస్తున్న నాయి బ్రాహ్మణుడికి మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అన్యాయం చేసిందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని వారు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా నాగ శీనుపై కేసు పెట్టింది మోహన్ బాబు…
సంగారెడ్డిలో నేడు తెలంగాణ జనసమితి పార్టీ రెండవ ప్లీనరీ సభ నిర్వహించారు. ఈ సభకు ప్రొఫెసర్ కోదండరాం, తెలంగాణ వివిధ జిల్లాల నుండి నాయకులు, కార్యకర్తలు హజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. భూమి ఇచ్చేవారి బతుకు బాగు పడాలని కోరుకుంటున్నామని, నీమ్జ్ ప్రాజెక్టు రాకూడదని రైతుల పక్షాన కోర్టుకు వెళ్ళామన్నారు. సింగరేణి భూ నిర్వాసితుల సమస్యలపై కూడా పోరాటం చేశామని, కాళేశ్వరం ఎత్తి పోత పథకం వల్ల వేల ఎకరాల పంట భూములు మునిగి పోతున్నాయన్నారు.…
చంద్రబాబు పోలవరం బ్యారేజీ కడదామనే భ్రమలో ఉన్నారంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ సెటైర్లు వేశారు. అందుకే పోలవరం బ్యారేజీ అంటున్నారని, మేము కడుతుంది పోలవరం ప్రాజెక్టేనని ఆయన అన్నారు. అంతేకాకుండా దీనిపై ఎవరితోనైనా ఓపెన్ డిబెట్ కు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఒక్క క్యూసెక్కు నీరు చుక్క తగ్గకుండా నీరు స్టోరేజ్ చేస్తామని, చంద్రబాబు తప్పిదాలు కారణంగా డయాఫ్రం వాల్ పునఃనిర్మాణం చేయాల్సి వస్తుందన్నారు. రాజమండ్రి నగరంలో 35 కోట్ల…
హైదరాబాద్‌లో పలువురు ఐపీఎస్‌లకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. డీసీపీ విజయ్ కుమార్‌ను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అంతేకాకుండా సెంట్రల్ జోన్ డీసీపీగా రాజేశ్ చంద్రకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. సౌత్ జోన్ డీసీపీగా సాయి చైతన్యను నియమించింది. ఈస్ట్ జోన్ డీసీపీగా సతీష్‌కు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. అయితే సైబరాబాద్ డీసీపీ విజయ్ కుమార్‌ను ఆకస్మికంగా బదిలీ…
దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు దిశగా పయనించనుందని..దీని ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గాలుల తీవ్రత పెరగి సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుడం కొనసాగుతోంది. తమిళనాడులోని నాగపట్నం నుంచి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం కావడంతో 13 కి.మీల వేగంతో ఉత్తర దిశగా వాయుగుడం కదులుతోంది. ఇది సాయంత్రం…
ఉక్రెయిన్ పొరుగు దేశాల నుండి మరో 629 మంది భారతీయులను తీసుకువస్తున్న మూడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) విమానాలు శనివారం ఉదయం హిండన్ ఎయిర్ బేస్‌లో దిగినట్లు వైమానిక దళం తెలిపింది. రష్యా సైనిక దాడి కారణంగా ఫిబ్రవరి 24 నుండి ఉక్రెయిన్ గగనతలం మూసివేయబడినందున, యుద్ధంతో దెబ్బతిన్న ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, స్లోవేకియా మరియు పోలాండ్ నుండి భారతదేశం తన పౌరులను ఖాళీ చేయిస్తోంది. “ఇప్పటి వరకు, భారత వైమానిక దళం…
కేటుగాళ్లు రోజురోజుకు మితిమీరిపోతున్నారు. కొత్తకొత్త ఐడియాలతో స్మగ్లింగ్ పాల్పడుతున్నారు. చివరికి కస్టమ్స్ అధికారులకు చిక్కి జైలు పాలవుతున్నారు. అయితే తాజాగా మరో వ్యక్తి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు కొత్తగా ఆలోచించి.. చివరికి అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. సౌదీఅరేబియా నుంచి ఓ వ్యక్తి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు. అయితే అతడిపి అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు.. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని తనతో పాటు తన వెంట తెచ్చుకున్న బ్యాగ్‌లలో కూడా తనిఖీలు చేశారు. అయితే తనవద్ద…
ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూ గడగడలాడిస్తోంది. ఉక్రెయిన్ సైనిక దళాలు కూడా రష్యాతో తలపడుతున్నాయి. అయితే ఇప్పటికే రెండుసార్లు యుద్ధం ఆపాలని రష్యాతో ఉక్రెయిన్ చర్చలకు దిగింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి రష్యాతో చర్చలు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉక్రెయిన్ దేశంలోని పలు కీలక నగరాలు రష్యా స్వాధీనంలోకి వెళ్లాయి. ఇరు దేశాల మధ్య జరిగిన రెండు దఫాల చర్చలు ఫలితాలనివ్వలేదు. ఈ క్రమంలో రష్యాతో మూడో సారి చర్చలకు…
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అసెంబ్లీకి సైకిల్‌పై బయల్దేరారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ రామానాయుడు సైకిల్ యాత్ర ప్రారంభించారు. నిమ్మల రామానాయుడు చేపట్టిన సైకిల్ యాత్ర పాలకొల్లు నుంచి అమరావతి సాగనుంది. ఆయనకు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలకొల్లులో తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రోజారమణి హారతిచ్చి ఎమ్మెల్యే నిమ్మల సైకిల్ యాత్రకు ఎదురు…
రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు తెలుసుకునే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా నేడు ములుగులో మంత్రి హరీశ్‌రావు ఈ సర్వేను మొదలుపెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 18 ఏండ్లు నిండిన 7 లక్షల మందికి పలు రకాల వైద్య పరీక్షలు చేయబోతున్నారు. ఇందుకోసం ములుగు జిల్లాలో 153 హెల్త్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సర్వే ప్రక్రియను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని…