Thief Letter: చతుషష్టి కళల్లో (64 కళలు)చోర కళ కూడా ఒకటి. మూడో కంటికి తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు, విలువైన వస్తువులు దొంగిలిస్తుంటారు దొంగలు. ఒకప్పుడు అర్థరాత్రి వేళల్లో, అందరూ నిద్ర పోతున్న వేళ ఇంట్లోకి చొరబడి దోచుకెళ్లేవారు. కానీ ఈ రోజుల్లో ఎప్పుడు పడితే అప్పుడే దొంగతనాలు జరుగుతున్నాయి. ఒక ఇంటిపై కన్నేశాడంటే దొంగతనానికి పాల్పడినదే నిద్రపోడు దొంగ. సాధారణంగా ఓ ఇంట్లో దొంగతనానికి జరిగి.. వస్తువులు దోచుకెళితే.. తిరిగి దొరుకుతాయన్న హోప్ ఉండదు. పోలీసులకు చెప్పినా.. దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం అని చెబుతారు. కానీ ఓ దొంగ దొంగతనానికి వచ్చి ఏమీ ఎత్తుకెళ్లట్లేదు.. బాధపడకు అంటూ ఓ కార్యాలయ యజమానికి లేఖ రాసి మరీ వెళ్లాడు. ఈ విచిత్ర సంఘటన నంద్యాల జిల్లాలోని చాబోలులో చోటుచేసుకుంది.
Read Also: Vinod Kambli: మద్యం మత్తులో నడవలేని స్థితిలో టీమిండియా మాజీ ఆటగాడు..
అసలేం జరిగిందంటే.. నంద్యాల జిల్లా చాబోలులోని విగ్నేశ్వర అగ్రికల్చర్ డ్రోన్ ఆఫీసులో ఓ దొంగ చోరీ కోసం వెళ్లాడు. కబోర్డ్స్ ,టేబుల్స్ వెతికినా డబ్బు కనిపించలేదు. ఆ ఆఫీసులో రూ.10 లక్షల విలువ చేసే డ్రోన్‌లు ఉన్నా దొంగ పట్టించుకోలేదు. కేవలం డబ్బు కోసం మాత్రమే ఆ దొంగ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిరాశతో, నిజాయితీగా దొంగ చీటీ రాసి పెట్టాడు. ఆ చీటీలో ‘అన్నా …దొంగతనానికి వచ్చా.. ఏమీ తీసుకెళ్లడం లేదు, బాధపడకు.” అంటూ రాసి వెళ్లాడు. అనంతరం డ్రోన్ ఆఫీస్‌కు వచ్చిన యజమాని నాగేశ్వర్ రెడ్డి.. చీటీ చూసి ఆశ్చర్యపోయాడు. యజమాని ఏమైనా తీసుకెళ్లాడా.. అని మొత్తం వెతికి చూడగా.. అతడు ఏమీ ముట్టుకోకుండా.. కేవలం డబ్బుల కోసమే వచ్చినట్లు తేలింది. ఈ విషయం అక్కడా వారికి తెలియడంతో దొంగలు ఇలా కూడా ఉంటారా.. అని ఆశ్చర్యపోతున్నారు. ఏదీ కనపడినా వదలకుండా ఎత్తుకెళ్లే .. ఈ రోజుల్లో ఈ దొంగ నిజాయితీ గురించి చర్చించుకుంటున్నారు.