చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. అనంతరం ఉండవల్లి వెళ్తూ మధ్యలో ఆగారు. ప్రకాశం బ్యారేజీపై కాన్వాయ్ ఆపి.. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి టీడీపీ ఎంపీ అప్పల నాయుడు ఓ అపురూప కానుకను అందజేశారు. ప్రధానిగా హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా చేనేత వస్త్రంపై ఒక చేనేత కుటుంబంలోని దంపతులతో మోడీ లఘు చిత్రాన్ని నేయించారు. చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ స్వయంగా ప్రధానికి బహుకరించారు.
English Teacher: మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. తనపై అత్యాచారం జరిగిందని మహిళా ఇంగ్లీష్ టీచర్ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే 19 ఏళ్ల యువ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నేతన్నలు తమ ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేయగా.. స్టాళ్లల్లో ఉత్పత్తులను పరిశీలించి వారితో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ స్టాళ్లలో సతీమణి భువనేశ్వరి కోసం చీరలను కొనుగోలు చేశారు. చీరల గురించి అడిగి తెలుసుకుని మరీ రెండు చీరలను కొనుగోలు చేశారు సీఎం చంద్రబాబు. వెంకటగిరి చీర, ఉప్పాడ జాందాని చీరలను సీఎం కొనుగోలు చేశారు.
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను గెలిపించాలని ఆయన కోరారు. ఈ ఎన్నికల్లో గెలిచినవారు, పోటీచేసిన అభ్యర్థులు అందరూ కూడా బొత్స పేరును ఏకగ్రీవంగా నిలబెట్టారని జగన్ చెప్పుకొచ్చారు. బొత్స గెలుపుకు మీరంతా అండగా ఉండాలని నేతలను కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సంఖ్యా బలం లేదని.. నైతికలు విలువలు పాటిస్తే గనుక టీడీపీ పోటీ పెట్టకూడదని ఆయన అన్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రామానుజపురం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కట్టుకున్న భార్యను పట్టపగలే నడి రోడ్డుపై కత్తితో నరికిన హత్య చేశాడు భర్త.
చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది.
రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం లో రేవంత్ కుటుంబ పాలన నడుస్తోందన, రేవంత్ తన సోదరులను తెలంగాణ మీదకు వదిలేశాడన్నారు. రేవంత్ సోదరులకు ఏ పదవులు లేకున్నా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. సాక్షాత్తూ అసెంబ్లీ కమిటీ హల్ లో రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి ఏ హోదా లేకున్నా…
గత రాత్రి నుంచి కురుస్తున్న బారీ వర్షాల వల్ల కొత్తగూడెం పట్టణంలోకి నీళ్లు వచ్చారు.మాతా శిశు ఆసుపత్రి చుట్టు వరద నీరుచేరడంతోఆసుపత్రిలో రోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఎగువన ఉన్న చెరువుల నీరు అంతా పొంగి ప్రవహించి పట్టణంలోకి రావడంతో ప్రజలు ఇక్కట్లకు గురి అయ్యారు.దీంతోపట్టణంలోకి వాహనాలు రాకుండా నిలిపివేశారు. విద్యా నగర్ సమీపంలోని కొన్ని కాలనీలకు వరద నీరుచేరింది. చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లోకి చింత చెరువు ద్వారా వరద నీరు వచ్చి చేరింది.దీంతో ప్రధానరహదారి…