జై గౌడ్ ఉద్యమం కమిటీ ఆధ్వర్యంలో 374వ సర్దార్ పాపన్న మహారాజ్ జయంతి వేడుకలు రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేఫ్టీ మోపులు ఇవ్వబోతున్నామని, ప్రభుత్వ.. అసైన్డ్ భూముల్లో యాభై శాతం తాటి.. ఈత.. కర్జూరా మొక్కలను పెంచాలని సీఎం చెప్పారని, బార్ల రూపంలో కల్లు షాపులను క్లాస్ గా మోడిఫై చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం.. నాది బాధ్యత అని, మొన్ననే సీఎంతో కలిసి భూమి పూజ చేయాలి అనుకున్నాం.. స్థలం కూడా పరిశీలించామని ఆయన వెల్లడించారు.
Aircraft Crashes: మధ్యప్రదేశ్లో కుప్పకూలిన శిక్షణ విమానం.. పైలట్లకు గాయాలు
పని ఒత్తిడిలో నేను ఏదైనా మర్చిపోతే నాకు గుర్తు చేయండని, కులం.. సమాజాన్ని సమానంగా నడిపిన వ్యక్తి సర్వాయి పాపన్న అని ఆయన కొనియాడారు. మనమే అనే విధానంతో కాకుండా అందరిని కలుపుకుని పోవాలని, ఒక్కరిగా రాజ్యాధికారం సాధ్యం కాదు.. అందరూ ఐక్యంగా ఉండాలన్నారు మంత్రి పొన్నం. మంత్రిగా నేను బిజీగా ఉంటే సంఘ నాయకులు ప్రభుత్వ దృష్టికి సమస్యలు తీసుకురండని, అధికారం అనేది శాశ్వతం కాదని, ఎన్నికల్లో పోటీ చేయండి.. మీ దగ్గర డబ్బు.. సమయం ఉంటే వాళ్లకి పోటీ చేసే వాళ్లకి సహాయం చేయండన్నారు. శీనన్న మీద.. నా మీద.. ఎవరి మీదైనా రాజకీయంగా దాడి జరిగితే సపోర్ట్ గా ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.
Saripodhaa Sanivaaram Trailor: భగభగభగ.. భగభగమని.. మాస్ పోస్టర్ తో ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్..