సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ మీటింగ్‌లో బీజేపీ ఇంచార్జీ అభయ్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభయ్ పాటిల్ మాట్లాడుతూ.. మీటింగ్ ప్రారంభానికి ముందే అందరూ ఫోన్లు ఆఫ్ చేయండి లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండని, ఎవరికైనా మెసేజ్ కాల్ వస్తే.. నేను బయటకు పంపించేస్తామన్నారు. ఆ తర్వాత బయటకు పంపించానని చెప్పొద్దని, నేను ఒక్కసారే చెబుతానన్నారు. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన సందర్భంలో కొందరిని బయటకు పంపించానని, నన్నెవరు ఏం చేస్తారనే ఓవర్ కాన్ఫిడెన్స్…
రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, దీనికి కారణం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేసేదంతా చేసి శాంతిభద్రతలపై రివ్యూ నిర్వహిస్తున్నారు అంటున్నారని, నిన్న ఏమైంది లా అండ్ ఆర్డర్ ? నిన్న ఆపి ఉంటే శాంతి భద్రతల సమస్యలు వచ్చేవి కావుకదా ! అని ఆయన అన్నారు. నిన్న యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా డీజీపీ గారు.. ఎవరిమీద దాడి…
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య…
ఏపీలో వరద నష్టం అంచనాలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీలోని మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఎన్యూమరేషన్ ఎంత మేర జరిగిందన్న అంశంపై సీఎం ఆరా తీశారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ఊహించని విపత్తు తలెత్తి...అపార నష్టాన్ని, కష్టాన్ని కలిగించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం ప్రజలను ఆదుకునేందుకు ఉదారత చూపాలని సీఎం కోరారు. వరద నష్టాలపై అంచనాల కోసం ఏర్పాటైన కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించింది. అనంతరం నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చిన ఈ విపత్తును సాధారణ విపత్తులా, గతంలో వచ్చిన వరదల్లా చూడవద్దని అన్నారు.
ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు వచ్చిన కేంద్ర బృందాలు సెక్రటేరియట్‌కు చేరుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యాయి. గత రెండు రోజుల నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటించాయి.
AP CM Chandrababu: ఏపీ సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లు తెలిసింది. ఉత్తమ్‌తో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇరువురి పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల్లో వరద ప్రభావంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తన చిన్ననాటి మిత్రుడిని పరామర్శించేందుకు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజయవాడకు వెళ్లినట్లు తెలిసింది.…
తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు.