Narendra Modi : తెలుగు ప్రజలకు ప్రధాని వినాయక నవరాత్రుల కానుక
- తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లు
- సెప్టెంబర్ 16న ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వినాయక నవరాత్రులకు కానుకను అందించనున్నారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో రైలు కనెక్టివిటీని మరింత పెంచేందుకు తీసుకొచ్చిన వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సేవలందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధానమంత్రి కేటాయించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య పరుగులు పెట్టనుంది. అదే సమయంలో విశాఖపట్టణం, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య మరో వందేభారత్ రైలు సేవలందించనుంది. ఈ రెండు రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 10 వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
సామాన్యులు వందే భారత్ రైళ్లపై మక్కువ చూపుతుండటం, 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండటం కారణంగా.. కేంద్రప్రభుత్వం ఈ రైళ్లతో వీలైనన్ని ప్రాంతాలను అనుసంధానించేందుకు కృషిచేస్తోంది. సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందేభారత్ రైలు.. నాగ్‌పూర్ నుండి ఉదయం 5:00 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ చేరుకుంటుంది. 578 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7.15 గంటల్లో పూర్తి చేయనుంది. ఈ రైలు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్ , సేవాగ్రామ్ స్టేషన్లలో ఆగనుంది.
Read Also : Brewing of Beer: బీర్ ప్రియులూ ఇది విన్నారా?.. మూత్రంతో బీర్ల తయారీ.. ఎక్కడంటే?
నాగ్‌పూర్ నుంచి మొదలయ్యే రైలు.. సికింద్రాబాద్ చేరుకునే సందర్భంలో స్వాగతం పలకాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆహ్వానం పంపించారు. ఇందులో.. తెలంగాణలో రూ. 32,946 కోట్లతో రైల్వే సేవల అభివృద్ధికి చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రికార్డు స్థాయిలో రూ.5,336 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇందులో రాష్ట్రంలోని 40 స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అటు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం, విశాఖపట్టణం నుంచి ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ ప్రాంతానికి వెళ్లనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రాయ్‌పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విశాఖపట్నం చేరుకోనుంది. ఈ సర్వీస్ మూడు రాష్ట్రాలలో (ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా) ప్రయాణికులకు సేవలందిస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..