జరిగిన ఆర్థిక అరాచకత్వం – కొద్ది మంది ప్రయోజనాలు, ప్రాపకం కోసం చేసిన వాటిని సరిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ – రేసింగ్ వల్ల ఒకరు టికెట్లు అమ్ముకున్నారు, మరొకరు రేసింగ్ చేసుకున్నారు మరి ఇన్ఫ్రాసట్రక్చర్ ఇచ్చిన రాష్ట్రానికి ఆదాయం సున్నా అన్నారు భట్టి. ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్ ను – బై పార్టీ రేసింగ్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్లు అమ్మేవాళ్లు, రేసింగ్…
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్‌ను మంగళవారం తన కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ పేరును మంగళవారం ప్రతిపాదించారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడం అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించిందన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ అధికారులతో ఇచ్చిందన్నారు. మేడిగడ్డలో జరిగిన…
ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయని, ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామన్నారు. ప్రజల్లో…
నేషనల్ క్రష్ రష్మిక 2023 లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించింది.. చివరగా నటించిన యానిమల్ సినిమాలో హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఈ సినిమా హిట్ తర్వాత అమ్మడు చాలా బిజీగా ఉన్నారు.. హైదరాబాద్ టు ముంబై తిరుగుతూ చక్కర్లు కొడుతుంది.. ఈ నేపథ్యంలో ఓ చిన్న పొరపాటు చెయ్యబోయ్యింది.. వెంటనే అలెర్ట్ అయ్యి క్షణాల్లో తప్పించుకుంది.. అందుకు సంబందించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్…
కొత్త ఏడాది వేళ జపాన్‌ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
హైదరాబాద్‌లో ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతుబంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు, ఎరువులను ఏ విధంగా అరికట్టాలి, సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, డ్రిప్, చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్, మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్,…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారాలన్నారు. నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మాణం చేసిందన్నారు కిషన్ రెడ్డి. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా…
తిరుమల తిరుపతి దేవస్థానం తన అధికారిక వెబ్సైట్ పేరులో మరోసారి మార్పులు చేర్పులు చేసింది. ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in అని కనిపించేది.. కానీ, దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.