ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మె విరమించారు. కార్మిక సంఘాలతో బుధవారం సాయంత్రం మంత్రివర్గ ఉపసంఘం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కాగానే కార్మిక సంఘాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక భూ అక్రమాలు జరిగాయన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ తో పాటు హైదరాబాద్ చుట్టూ ఓ ఎమ్మెల్సీ వందల ఎకరాలు కబ్జా చేశారని కథనాలు వచ్చాయన్నారు. దీనిపై కేటీఆర్, హరీశ్ రావు స్పందించలేదని ఆయన అన్నారు. ఇలాంటి వారిని పెద్దల సభకు పంపి ప్రజాస్వామ్యంను అపహాస్యం చేసిందని విజయ రమణారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు గడవకముందే ఏమీ చేయలేదని బీఆర్ఎస్ నేతలు…
విజయవాడ ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేశినేని నాని ప్రకటించారు. తన రాజీనామాను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మెయిల్ ద్వారా పంపించారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసిన కేశినేని నాని.. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు.
పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్‌లను డిస్కౌంట్‌తో క్లియర్ చేసే తేదీని జనవరి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పొడిగించింది. ప్రజల నుండి ప్రోత్సాహకరమైన స్పందన దృష్ట్యా తేదీని నెలాఖరు వరకు పొడిగించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. పెండింగ్‌లో ఉన్న చలాన్‌లపై రాయితీ గడువు పొడిగింపు జనవరి 10 నుండి జనవరి 31 వరకు సవరించబడింది. తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తమ వాహనాలపై పెండింగ్‌లో ఉన్న చలాన్‌లను ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా…
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం వద్ద డేటా ఎంట్రీ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీవీతో రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా ఎక్కడి దరఖాస్తులను అక్కడ ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నామని తెలిపారు. అందుకోసం 5000 మంది డేటా ఎంట్రీ సిబ్బందిని ఎంగేజ్ చేసామని ఆయన వెల్లడించారు. ప్రతి దరఖాస్తులోని డేటా ఆన్లైన్లో ఎంటర్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రతి వార్డులో నాలుగు కేంద్రాలలో దరఖాస్తులు స్వీకరించాము…
10 సంవత్సరాలుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల కింద 813 మందికి కండక్టర్లుగా తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. టీఎస్ ఆర్టీసీలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్టీసీ అధికారులకు రవాణా బీసీ సంక్షేమ శాఖ…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కసరత్తు జరుగుతోంది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఈసీ బృందం పర్యటించిన సంగతి తెలిసిందే. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు, రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈసీ సమావేశాలు, సమీక్షలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్‌కుమార్ విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు మరోసారి హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు ను తప్పుదోవ పట్టించారా లేదా.. అని చెన్నమనేని ప్రశ్నించిన హైకోర్టు… కోర్టు ను తప్పుదోవ పట్టించునే వాళ్లకు ఉపషమనం ఎందుకు కల్పించాలని వ్యాఖ్యానించింది. 2018 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో జర్మనీ పౌరసత్వం తో పోటీ చేసారన్న హైకోర్టు.. జర్మనీ పౌరసత్వం తోనే ఇంకా ప్రయాణాలు చేస్తున్నారా అని హైకోర్టు ప్రశ్నించారు. 2018 ఎన్నికల సందర్భంగా జర్మనీ…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. సీఎం జగన్తో కీలక భేటీ అనంతరం కేశినాని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు. తనను టీడీపీలో తీవ్రంగా అవమానించారని, తన రాజీనామాను ఆమోదించిన అనంతరం వైసీపీలో చేరతానని ఆయన తెలిపారు.