ఇందిరమ్మ ప్రజా పాలనలో రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందంగా జరుపు కోవాలని, సంక్రాంతి పండుగ రైతుల జీవితాలతో పాటు ప్రజలందరికి నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోగీ, సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. వరి ధాన్యం ఇంటికి చేరిన వేళ బందు మిత్రులతో, పశు పక్షాధులతో సంతోషంగా జరుపుకునే పండుగ ప్రతి ఇంట్లో…
సూర్యాపేట జిల్లాలో నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పర్యటించారు. ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్లు వద్ద దండు మైసమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన పాటు సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పాల్గొన్నారు. పూర్ణకుంభంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్…
ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్న వారందరూ చంద్రబాబు కోవర్టులే.. ముందు నుంచి చంద్రబాబుతో టచ్‌లో ఉన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
కొత్తూరు మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి 16 నెలల చిన్నారి మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. కొత్తూరు మునిసిపాలిటీ లో బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేందర్ చోబె దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. ధర్మేందర్ చోబె దంపతులు వస్త్ర కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా పెద్ద కూతురు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే…
ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తొలిసారిగా వచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, సీట్ల సర్దుబాటు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణపై నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి విడత చర్చలు పూర్తి అయిన సంగతి తెలిసిందే.
తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ, విదేశాల్లోని హిందూ బంధువులందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ భోగి పండుగ భోగ భాగ్యాలను అందించాలని, సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతిని నింపాలని, కనుమ పండుగ కన్నుల పండుగై మీ ఇంటిలో సుఖసంతోషాలు, ఆనందానురాగాలు పంచాలని ఆ అమ్మ వారిని వేడుకుంటున్నానన్నారు. అంతేకాకుండా హిందువుల ఆత్మ గౌరవ ప్రతీక, భారతీయుల 5 శతాబ్దాల నిరీక్షణ అయోధ్య రామ…
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్‌లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి సారి కైట్ ఫెస్ట్ జరుపుకుంటున్నామని, అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలన్నారు. టూరిజం శాఖ నీ దేశం లోనే అగ్రగామి తీసుకెలెందుకు మినిస్టర్ కష్టపడుతున్నాడని, ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కొరుకుంటున్నామన్నారు. టూరిజం ఆదాయం పెరగాలని…
విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్టీల్ ప్లాంట్లోని బీఎఫ్-3లో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో వెంటనే అగ్నిమాపక సిబ్బంది ప్రమాదస్థలికి చేరుకున్నారు.
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరజిమ్మాలని అన్నారు. భోగ భాగ్యాలను అందించే భోగి.. కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగలు.. అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు. తెలంగాణలో మొదలైన ప్రజా పాలనలో స్వేచ్ఛా సౌభాగ్యాలతో…