ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై సంచలన ఆరోపణలు గుప్పించారు. ఆప్ పార్టీకి చెందిన ఏడుగురు ఢిల్లీ ఎమ్మెల్యేలను కొని తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ట్రై చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి పదవికి ఇవాళ నితీశ్ కుమార్ రాజీనామా చేయబోతున్నట్లు సమాచారం. దాంతో ఇప్పటి వరకూ ఉన్న ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.
బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు.
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కూలీల ఆటోను ఢీకొట్టింది.. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఈ ఘటన ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలోచోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే.. వేలూరు గ్రామానికి చెందిన 15 మంది వ్యవసాయ కూలీలు ఆటోలో నాదెండ్ల మండలం అప్పాపురంలో మిర్చి కోతలకు వెళుతున్నారు. అదే సమయంలో మాచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు…
75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తలపాగాలో మెరిశారు. ప్రధాని బాధ్యతలు స్వీకరించిన తర్వాత నుంచి రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే దినోత్సవాల్లో వేడుకల్లో తలపాగా కట్టుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
ఇజ్రాయెల్- పాలస్తీనా వివాదానికి శాశ్వత పరిష్కారాన్ని వెతకాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు నరకప్రాయంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థులకు ఫ్రాన్స్ అందించే తోడ్పాటు గురించి కూడా అధ్యక్షుడు ఇమాన్యయేల్ మెక్రాన్ వివరించారు.
భారత్తో సరిహద్దు వివాదంపై డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను సరిహద్దు వివాదంతో ముడిపెట్టడం సరికాదని వెల్లడించింది. డ్రాగన్ కంట్రీ చర్యల ఫలితంగానే తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.
తమిళనాడులో రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారతున్నాయి.. ఇప్పుడు మరో కొత్త పార్టీ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలయ దళపతిగా తమిళనాట అశేష అభిమానం సంపాదించుకున్న విజయ్ త్వరలో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. మక్కల్ ఇక్కయం నిర్వాహకులతో సమావశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో అందరు కొత్త పార్టీ పెట్టాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు హీరో విజయ్ కూడా రాజకీయాల పైనే చర్చలు జరపడంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.. ఇకపోతే…