గజ్వేల్ ENC హరిరామ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్. కమిషన్ చీఫ్ 90కి పైగా ప్రశ్నలను అడిగారు. అయితే.. పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ENC హరిరామ్ దాటవేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి కమిషన్ ముందు ENC హరిరామ్ హాజరుకానున్నారు. ఇవ్వాళ సమాధానం చెప్పని ప్రశ్నలకు రేపు డాక్యుమెంట్స్ సమర్పిస్తామని హరిరామ్ చెప్పారు. అయితే.. ఇప్పటి వరకు కార్పొరేషన్ ద్వారా బ్యాంక్ లకు 29వేల 737 కోట్లు రీ…
హైడ్రా లక్ష్యం సంచులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సమకూర్చడమే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని, ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయమని ఆమె మండిపడ్డారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం బెంబేలెత్తిస్తోందని, హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందన్నారు డీకే అరుణ. హైదరాబాద్ రావాలంటే పెట్టుబడి దారులు భయపడాల్సిన పరిస్థితి అని, కేసీఆర్ కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందన్నారు…
ఇండిగో ఎయిర్‌లైన్స్ అయోధ్య సహా ఏడు కొత్త నగరాలకు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి కొత్త మార్గాలు హైదరాబాద్‌ను రాజ్‌కోట్, అగర్తల, జమ్మూ, ఆగ్రా, కాన్పూర్, అయోధ్య , ప్రయాగ్‌రాజ్‌లకు కలుపుతాయి. విమానయాన సంస్థ సెప్టెంబర్ 28న అయోధ్యకు నేరుగా విమానాన్ని ప్రారంభించనుంది, సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో వారానికి నాలుగు సార్లు నడుస్తుంది. జూన్ 1న స్పైస్‌జెట్ హైదరాబాద్ నుండి అయోధ్యకు తన డైరెక్ట్ విమానాలను నిలిపివేసిన తర్వాత…
Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి మరో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయన్నారు. బతుకమ్మ చీరలపై ప్రజలకు క్షమాపణలు చేయాల్సింది పోయి నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం మొగోడే కాబట్టి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రజా పాలన అందిస్తున్నాడని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడే దురహంకార పొగరు మాటలను ప్రజలు చీత్కకరిస్తున్నా కూడా మారడం…
మహబూబాబాద్ జిల్లా లోని పలు రైస్ మిల్లుల పై రాష్ట్ర సివిల్ సప్లైస్, టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. 24 కోట్ల 55 లక్షల 33 వేల రూపాయల సి.ఎం.ఆర్ ధాన్యం ను మాయం చేసిన 3 రు రైస్ మిల్లుల యజమానుల పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఓ.ఎస్.డి ప్రభాకర్ మాట్లాడుతూ, ఖరీఫ్ , రబీ లో ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను కస్టం…
ఎలాంటి ప్రత్యామ్నాయం, పునరావాసం కల్పించకుండానే హైదరాబాదు మూసీ నది పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇండ్లు, గుడిసెలను హైడ్రా అధికారులు వెంటనే తొలగించేందుకు పూనుకోవడాన్ని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగా పునరావాసం కల్పించిన తర్వాతనే ఇండ్లను కూల్చే పనిని చేపట్టాలని, మూసీ అభివృద్ధి పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నదన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో…
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూ కుంభకోణమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోర్త్ సిటీ పేరుతో తన సోదరులకు వేల కోట్లు లబ్ధి చేసే కుట్ర అని, ఫార్మాసిటీ వ్యవహారంలో ప్రభుత్వం పై కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఫార్మాసిటీ ఉన్నట్టా? లేనట్టా స్పష్టం చేయండని, కోర్టులో మాత్రం ఫార్మాసిటీ కొనసాగుతుందంటూ న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఫార్మాసిటీని రద్దు చేస్తే రైతుల భూమి వారికి అప్పగించాలని,…
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండని కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణలో తీసుకోండని, 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు కిషన్ రెడ్డి. అక్రమంగా భూములు అమ్మినవారినీ బాధ్యులను చేయాలి, వారి పై చర్యలు తీసుకోవాలని, రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డునపడేస్తే వాళ్ల బతుకులు ఏమై పోతాయన్నారు. పాలకుల,…