వివాదాస్పద దర్శకుడు వర్మ నుంచి వచ్చిన సినిమా యాత్ర2.. యాత్ర 2 చిత్రం ఫిబ్రవరి 8న థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ కొన్ని చోట్ల షోలు పడ్డాయి. కొంత మంది ప్రజా ప్రతినిధులకు బుధవారం రోజున షోలు వేశారు. అలా యాత్ర 2 టాక్ ఇప్పుడు బయటకు వచ్చింది.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.. ముఖ్యంగా ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది అని చెప్పడంలో సందేహం లేదు.. ఈ సినిమా టాక్ ఎలా ఉందో,జనాలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం పదండీ..
మహి వీ రాఘవ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఏ జానర్ అయినా సరే ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా తీయడం ఆయన ప్రత్యేకత. ఆనందో బ్రహ్మా తీసినా.. యాత్ర తీసినా ఆయన ఆడియెన్స్‌ను మెప్పించాడు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాద యాత్ర ఆధారంగా తీసుకొని యాత్ర2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
అయితే ఈ సినిమా రాజకీయాలకు సంబంధించినది కాదని, ఎవరిని కించపరిచే విధంగా తీసిన సినిమా కాదని, ఓ తండ్రికి కొడుకు ఇచ్చిన మాట.. ఆ మాటను నిలబెట్టుకునే కొడుకు కథ అంటూ మహి వీ రాఘవ్ ముందు నుంచి చెబుతూనే వచ్చాడు. ఇక ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. నెట్టింట్లో టాక్ బాగానే వస్తోంది.. ప్రస్తుతం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తుంది.. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలినా అది పిల్లే సార్.. పుల్లిని తీసుకొచ్చి బోనులో పెట్టినా అది పులే సార్ అంటూ శుభలేఖ సుధాకర్ చెప్పిన డైలాగ్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయట.. జగన్ పాత్రలో జీవా, రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టిలు జీవించారని తెలుస్తుంది.. ఒకవైపు విమర్శలు ఎదురవుతున్నా కూడా మరోవైపు సినిమా మాత్రం బాగుందని మెజార్టీ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.. మొత్తానికి ఈ సినిమా మిక్సీ్డ్ టాక్ తో దూసుకుపోతుందని తెలుస్తుంది..