Duddilla Sridhar Babu : పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనువైన ప్రాంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ చాలా అనువైన ప్రాంతం అని, పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం మాదాపూర్ లోని ఐటీసీ కోహినూర్ లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్ పీరియన్స్ సమ్మిట్ లో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
1990వ దశకంలో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఐటీ ఇండస్ట్రీ కి అంకురార్పణ చేశారని, తర్వాత ఒక పార్టీ, మధ్యలో మళ్ళీ కాంగ్రెస్, 2014 లో ఇంకో పార్టీ, ఇప్పుడు మళ్ళీ తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అయినా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
Also Read
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
- VIVO S60T: 7200mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్‌ప్లే.. Vivo S60t స్మార్ట్ ఫోన్ లాంచ్..
టెలి పర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్ ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేశినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్ లో అనుకూల వాతావరణం, మానవ వనరులు, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పుష్కలంగా ఉన్నాయి..రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి.. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కు ప్లాన్ చేస్తున్నాం.. ఐఎస్బీ తరహాలో ఇది స్కిల్డ్ మ్యాన్ పవర్ అందిస్తుంది.. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయి..
రాష్ట్రంలోని గ్రామాల్లోనూ కుటుంబానికి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉన్నారు.
హైదరాబాద్ దేశానికి మధ్యలో ఉంది.. ఇక్కడి నుంచి ఏ మెట్రోపాలిటన్ సిటీకి అయిన రెండు గంటల్లో వెళ్లొచ్చు.. ఇక్కడ భూకంపాలు రావు, ప్రకృతి విపత్తుల ప్రమాదం లేదు.. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీ. మా ప్రభుత్వం టూరిజంపైనా ప్రత్యేక దృష్టి పెట్టింది.. టూరిజం గ్రోత్ 20 శాతం పెంచాలని టార్గెట్ పెట్టుమున్నాం..
రేపటి నుంచి బడ్జెట్ సెషన్ నిర్వహిస్తున్నాం, ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నాం. జూన్ లో హైదరాబాద్ లో ఆర్టిఫిసీయల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏ ఐ కంపెనీలను సమ్మిట్ కు ఆహ్వానిస్తున్నాము. హైదరాబాద్ ను ఏఐ టెక్నాలాజీకి హెడ్ క్వార్టర్స్ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాము.
తాజావార్తలు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
-
Quba Pub Fight: విశాఖ ‘క్యూబా’ పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!