కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయ్యిందన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి నెలలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారన్నారు. ఆరోగ్య శ్రీ 15 లక్షలు పెంచారని, రూ. 500 కె సిలిండర్, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ త్వరలోనే ప్రారంభం కానుందన్నారు జగ్గారెడ్డి. సోనియాగాంధీ.. రాహుల్ గాంధీల నిర్ణయం మేరకు పథకాల అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 9 ఏండ్లలో మంత్రులు.. ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కి రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీఆర్‌ఎస్ వాళ్లే సంతోషంగా లేరని, వాళ్లు ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని నడిపారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలే అయ్యిందని, కేటీఆర్.. ఆరు నెలలు ఆగండి కేసీఆర్ సీఎం అవుతారు అంటున్నారన్నారు. హరీష్ ది అదే మాట అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ లకు భయం పట్టుకుందని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 20 మంది కాంగ్రెస్ లోకి వచ్చే అవకాశం ఉందని భయం ఉందని, పార్టీని కాపాడుకోవాలని.. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోంది అని అంటున్నారన్నారు. రాజకీయ సందిగ్ధం లో కేసీఆర్ ఫ్యామిలీ ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
విజయ సాయి రెడ్డి కూడా రాజ్యసభలో మాట్లాడారని, తెలంగాణ ప్రభుత్త్వాన్ని కూల్చే వకాలత్ తీసుకున్నవా విజయ సాయి రెడ్డి అంటూ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. బీజేపీ దగ్గర వకాలత్ తీసుకిన్నట్టుందని, మోడీ డైరెక్షన్ లోనే….కేసీఆర్.. జగన్ నడుస్తున్నారన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన చేయడం తోనే రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. మీకు స్వయం పాలన వచ్చింది కాంగ్రెస్ తోనేనని, హరీష్.. కేటీఆర్.. తెలంగాణ ఆర్థికంగా ఎదగొద్దు అని చూస్తున్నారన్నారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళను కన్ఫ్యూజన్ పెట్టడం కోసమే బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. వాల్ల రాజకీయ ఎత్తుగడలు తిప్పి కొడతామని జగ్గారెడ్డి అన్నారు. మేము అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతారని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్తున్నారన్నారు. మేము ఈ ఐదేళ్ల తో పాటు… వచ్చే ఐదేళ్లు ఎలా అధికారంలో ఉండాలి అని ప్లాన్ చేస్తున్నామన్నారు. 12 నుండి 14 ఎంపీ సీట్లు గెలవాలని మేము ప్లాన్ చేస్తున్నామన్నారు.