ఈ సారి సమ్మర్ ముందుగానే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఫిబ్రవరి మొదలు కాగానే ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దానితో జనాలు కూడా అప్రమత్తం కావాల్సిన టైం వచ్చేసింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. మన శరీరాన్ని డీహైడ్రేట్ అవకుండా చేసుకోవాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. అవి ఏంటంటే..
దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను కవిత గతేడాది సవాల్ చేశారు.
హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో రాంజీ గోండు ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొన్నారు. నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా రామ్‌జీ గోండు పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సి ఉందన్నారు.
ఈ మధ్య సినీ ప్రియులు రొటీన్ స్టోరీలతో వస్తున్న సినిమాల కన్నా కొత్త కథలతో, కుటుంబ కథలతో వస్తున్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. అలాంటి సినిమాలే ఈ మధ్య భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా మరో కొత్త లవ్ స్టోరీతో వస్తున్న సినిమా లవ్ @65.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది.. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన…
కులగణన తీర్మానాన్ని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ కులగణన తీర్మానాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. కులగణనతో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని మంత్రి పేర్కొన్నారు. కులగణనపై రాజకీయాలు చేయొద్దని ఆయన అసెంబ్లీలో తెలిపారు. కులగణనపై ఎవరికీ అనుమానం అవసరం లేదన్నారు.
సౌత్ సినీ నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణం కోసం కావాల్సిన నిధుల కోసం కొలీవుడ్ స్టార్ హీరో విశాల్ తీవ్రంగానే కష్టపడుతున్నారు. 2019 లో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా వాటి ఫలితాలను 2022లో ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఆ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్, ఉపాధ్యక్షుడిగా పూచి మురుగన్, జనరల్ సెక్రటరీగా విశాల్, ట్రెజరర్‌గా హీరో కార్తీని ఎంపిక చేశారు.. అయితే ఈ సంఘం భవన నిర్మాణం కోసం గతంలో డబ్బులు కొరతగా ఉన్నట్లు హీరో…
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ కోసం కాంట్రాక్టర్లను, బిల్డర్లను, కంపెనీలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు.
8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5మంది బీఆర్ఎస్ ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్తో పొత్తు ఉండదని.. ఇదంతా కేసీఆర్ ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. సాక్షాత్తు ప్రధాని మోడీనే వారి అవినీతిపై మాట్లాడారని బండి సంజయ్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ మరో షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో పలువురు బీఆర్ఎస్ నేతలు చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
ఆర్థిక సంక్షోభం కారణంగా తమ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఉద్యోగులను తగ్గించుకుంటున్నారు.. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఇలా ఉద్యోగులను తొలగించాయి.. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి మరో ప్రముఖ కంపెనీ వచ్చి చేరింది.. స్పోర్ట్స్ వేర్ కంపెనీ నైకీ ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా తమ ఉద్యోగుల్లో రెండు శాతం లేదా 1,600 మందికి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ప్రకటించింది.. రన్నింగ్, మహిళల దుస్తులు, జోర్డాన్ బ్రాండ్ వంటి విభాగాల్లో పెట్టుబడులను పెంచడానికి కంపెనీ తన…