ఒక్క రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 58 నెలలు అలసిపోకుండా పేదలకు సేవ చేశామన్నారు. మరో రెండు నెలలు పేదవారి బతుకులు మార్చేందుకు యుద్ధానికి సిద్ధమా అంటూ సీఎం పేర్కొన్నారు. లంచంలేని, వివక్ష లేని వ్యవస్థ తీసుకురావాలన్నదే వాలంటీర్ల వ్యవస్థ లక్ష్యమని సీఎం తెలిపారు.
ఈమధ్య ప్రముఖ ఐటి కంపెనీలు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు వేల మందిని ఇంటికి పంపించింది.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది.. గత ఏడాది ఈ తొలగింపులు ఎక్కువ అయ్యాయి.. 2023లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు…
బడ్జెట్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు. బడ్జెట్‌లో కేటాయించిన ప్రతి రూపాయిని అన్ని వర్గాలకు చేరాలన్నదే మా ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిగా రాజ్యాంగ పీఠికను గుర్తు చేశామన్నారు. ఇచ్చిన హామీలు, అమలు, బడ్జెట్ ఉందా లేదా అనేది అంచనా లేకపోవడంతో పదేళ్లు ఇబ్బంది జరిగిందన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలు మరోసారి బహిర్గతం అయ్యాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్లను బీజేపీ లంచం, కమీషన్ల కోసమే స్వీకరించేందుకు సాధనంగా మార్చుకుందని ఆరోపించాడు.
ఢిల్లీ హైకోర్టుకు బాంబుల బెదింపులు రావడం తీవ్ర కలకలం రేపుతుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఢిల్లీ హైకోర్టుకు బాంబు బెదిరింపులను ఈ- మెయిల్ ద్వారా పంపారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు న్యాయస్థానం దగ్గర కట్టుదిట్టమైన భద్రతాను ఏర్పాటు చేశారు.
ఎలక్టోరల్ బాండ్లను 1000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, లక్ష రూపాయలు, కోటి రూపాయల వరకు గుణిజాలలో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలలో మాత్రమే అందుబాటులో ఉంటాయి.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమా చేస్తున్నాడు.. ఆయన ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే..ఆ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపారు. ఈ మేరకు ఓ ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోలో ఆయన నడుముకి బెల్ట్ పెట్టుకుని క్రచస్ సపోర్టుతో నిల్చోని కనిపించారు… ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో మనం చూసాము.. అయితే ఇది షూటింగ్ లో…
తెలంగాణ రాష్ట్రములో ఉన్న 197 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన కార్య వర్గములు ఏర్పాటు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. ఈ మేరకు ఈ నెల 12న ఇప్పటికీ కొనసాగుతున్న 123 మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడమైనదని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరాధరణకు గురైన వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పునర్వైభవం తెచ్చే దిశలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు కాబోయే కమిటీలకు సహాయ సహకారాలు…
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో రెడ్ల సత్రం వద్ద స్థానికులకు చిరుతపులి కనిపించింది. చిరుతపులిని చూసిన భక్తులు, స్థానికులు చిరుతపులి వీడియోలు సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.