ఈ మధ్య సినీ ప్రియులు రొటీన్ స్టోరీలతో వస్తున్న సినిమాల కన్నా కొత్త కథలతో, కుటుంబ కథలతో వస్తున్న సినిమాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.. అలాంటి సినిమాలే ఈ మధ్య భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తాజాగా మరో కొత్త లవ్ స్టోరీతో వస్తున్న సినిమా లవ్ @65.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కూడా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని తాజాగా విడుదలైన ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది..
సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, జయప్రద ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా లవ్@65. సీనియర్ సిటిజన్స్ లవ్ లో పడితే అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2021 లో మొదలవగా తొందరగానే షూటింగ్ ఫినిష్ అయిన ఈ సినిమా రిలీజ్ కి మాత్రం ఇప్పుడు రెడీ అయింది.. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా కు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.. సునీల్, అజయ్,సుధీర్ తదితరులు ప్రత్యేక పాత్రల్లో నటించారు..
ఈ సినిమా ద్వారా ఎలాగైనా మంచి కం బ్యాక్ ఇవ్వాలని డైరెక్టర్ VN ఆదిత్య ప్రయత్నిస్తున్నారు. అంతే కాదు నటుడిగా రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య కాలంలో మెయిన్ లీడ్ గా సినిమా చేయలేదు. ఇక అలనాటి హీరోయిన్ జయప్రద కు కూడా తెలుగులో ఇది ఒక రీ లాంచ్ లాంటింది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ జనాలను ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా హార్ట్ టచింగ్ సీన్స్ తో ఆకట్టుకుంటుంది.. ఆ వయస్సులో ప్రేమ పుడితే నిజంగా ఇలా ఉంటుందా అని కళ్ళకు కట్టినట్లు చూపించారు.. మొత్తానికి ట్రైలర్ అయితే జనాలను తెగ ఆకట్టుకుంటుంది..