ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఆగస్టు 15 న సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.. ఇక బన్నీ పుట్టినరోజు నాడు రిలీజ్ అయిన టీజర్ మాత్రం పునకాలు తెప్పిస్తుంది.. సినిమా మొత్తంలో…
తరిగే పార్టీ, ఇరిగే పార్టీలు మిగతావి, పెరిగే పార్టీ మాత్రం బీజేపీనే అని వ్యాఖ్యానించారు మురళీధర్ రావు. ఇవాళ ఆయన ఆదిలాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తెలంగాణ పార్టీ కాదని, కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే 50 ఏళ్లుగా ఎందుకు అపారన్నారు. తెలంగాణ కు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. దేశం నడవాలంటే బలమైన నాయకుడు కావాలి.. అది మోడీనే అని ఆయన అన్నారు. ఉగ్ర వాదం ను కాలు కింద వేసి తొక్కిన…
కాంగ్రెస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ డమ్మీ క్యాండిడేట్ అని కేటీఆర్ దురహంకారంతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క కేటీఆర్‌పై ధ్వజమెత్తారు. కేటీఆర్ దురహంకారీ,ఆడవాళ్ళు అంటే గౌరవం లేదని, బొజ్జు, సుగుణ లాంటి అనామకులే ఈ రోజు మిమ్మలిని ఓడించారన్నారు. తెలంగాణ ప్రజల త్యాగాల మీద నీకు పదవులు వచ్చాయని, కేటీఆర్, కేసిఆర్ కు ఇంకా బుద్ధి రావడం లేదన్నారు మంత్రి సీతక్క. కేటీఆర్ నీకన్న సుగుణ ఎంతో గొప్ప అని, నోరు జారకు కేటీఆర్ డబ్బు…
ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పొ ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తుంది.. తాజాగా అదిరిపోయే ఫీచర్స్ కలిగిన ఒప్పో A3 ప్రో మొబైల్స్ ను లాంచ్ చేశారు.. A సిరీస్ హ్యాండ్‌సెట్‌ను మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్‌సెట్‌తో అమర్చింది.. 6.7 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 64ఎంపీ ప్రైమరీ రియర్ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ ను, ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కొత్త…
కరీంనగర్ లోని డ్రైనేజీ త్రాగునీరు సమస్యలను తెలుసుకునేందుకు 21వ డివిజన్‌లో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పర్యటించారు. 21 డివిజన్‌లో డ్రైనేజీ వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. బోర్ నీళ్లలో కూడా డ్రైనేజీ వాటర్ కలవడంతో నీరు దుర్వాసన కొడుతోందని ఆయన వెల్లడించారు. కార్పొరేషన్ పరిధిలోనే ఉన్న 21వ డివిజన్లో అభివృద్ధి పనులను కార్పొరేషన్ ఆదిమరిచిందన్నారు. 21 డివిజన్ పాకిస్తాన్లో ఉందా బంగ్లాదేశ్ లో ఉందా అని ఆయన ప్రశ్నించారు.…
నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులు ఇచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ధి పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గు చేటు అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి వెంకట్రామ రెడ్డి (IAS Retd) అన్నారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని నన్ను డబ్బులు తరలించినట్టు కథ అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమే. ఆ సమయంలో నేను ఎమ్మెల్సీగా పరోక్ష రాజకీయంలో ఉన్న…
టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే పేరుకు పరిచయాలు అక్కర్లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఒకటో, రెండో సినిమాలు చేస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు. తనకు సంబందించిన ప్రతి విషయాన్ని లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా బుట్ట బొమ్మ కొత్త ఇల్లు కొన్నదన్న విషయాన్ని కూడా పంచుకుంది.. తన కొత్త ఇంటికి సంబందించిన ఓ వార్త నెట్టింట తెగ…
కేటీఆర్ అభినవ గోబెల్స్ లాగా అయ్యారని కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నన్ను బీఆర్ఎస్ లోకి రమ్మని ఇబ్బంది పెట్టారని, నా ఫోన్ ట్యాపింగ్ అయిందని కంప్లైంట్ ఇవ్వగానే కేటీఆర్ కి పూనకం వచ్చిందన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నేను ఫిర్యాదు ఇస్తే పరువునష్టం ఎలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇంకా అధికారంలోనే ఉన్నానని కేటీఆర్ అనుకుంటున్నారని, కేటీఆర్ ఇచ్చిన నోటీస్ చట్టానికి విరుద్ధంగా ఉందన్నారు.…
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో దివంగత కాంగ్రెస్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు 25వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మేయర్ అనిల్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన…
తాగునీటి సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికా బద్దంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా తాండూరు సమీపంలోని కాగ్నా నది నుండి త్రాగు నీరు అందించే పంప్ హౌస్ ను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, మిషన్ భగీరథ ఉన్నతాధికారులతో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ పరిశీలించారు. ఈ సందర్భంగా పత్రికా…