ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు.. గతంలో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్త్ డే సర్ ప్రైజ్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.. ఆ టీజర్ కు జనాల నుంచి మంచి స్పందన లభించింది..
పుష్ప-2 టీజర్ భారీ వ్యూస్ తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అతి తక్కువ టైమ్‌లో మిలియన్ల వ్యూస్ సాధించిన టీజర్.. తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. ఏకంగా 138 గంటలలో యూట్యూబ్‌లో నంబర్ వన్ స్థానంలో రన్ అవుతున్న టీజర్‌గా నిలిచింది. ఇప్పటివరకు పుష్ప-2 టీజర్‌కు 110 మిలియన్లకు పైగా వ్యూస్, 1.55 మిలియన్ల లైక్స్‌తో దూసుకెళ్తోంది. తాజాగా ఈ విషయాన్ని పుష్ప టీం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు..
ఇకపోతే పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా కోసం తెలుగుతో పాటు బాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటికే హిందీలో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యాయాని తెలుస్తుంది.. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు వెయిట్ చెయ్యాల్సిందే..