Pushpa 2: పుష్ప గాడు దిగుతున్నాడంటే ఆ మాత్రం భయం ఉండాల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 సినిమా కోసం యావత్ సినీ ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. ఆగస్టు 15 న సినిమాను పాన్ ఇండియా లెవల్ లో విడుదల చెయ్యనున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పాయి.. ఇక బన్నీ పుట్టినరోజు నాడు రిలీజ్ అయిన టీజర్ మాత్రం పునకాలు తెప్పిస్తుంది.. సినిమా మొత్తంలో అల్లు అర్జున్ ఎలా ఉంటాడో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..
ప్రస్తుతం ఆ టీజర్ యూట్యూబ్ లో చక్కర్లు కొడుతుంది.. జాతర సీన్ ఒక్కదాని కోసం భారీగా ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు సినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలనే ఆలోచనలో సుక్కు ఉన్నాడని తెలుస్తుంది.. ఇక పోతే తెలుగు ప్రేక్షకులతో పాటుగా బాలీవుడ్ జనాలు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
ఇదిలా ఉండగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వాయిస్ వినిపిస్తుందని వార్తలు వినిపించాయి.. ఇదే కనుక నిజమైతే సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంటుంది. ఇక పుష్ప 2 2024లో భారతీయ చలనచిత్రరంగంలో అత్యంత భారీ అంచనాలు ఉన్న చిత్రాలలో ఒకటి.. ఈ సినిమా విడుదల ఎఫెక్ట్ బాలీవుడ్ లోని బడా సినిమాల పై పడిందని తెలుస్తుంది.. బాలీవుడ్ బిగ్గీ వాయిదా పడుతుంది.. ఇంకా పలు సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి.. ఇది విన్న బన్నీ ఫ్యాన్స్ పుష్ప గాడు దిగుతున్నాడంటే ఆ మాత్రం భయం ఉండాల అంటూ పుష్ప పోస్టర్స్ తో నెట్టింట రచ్చ చేస్తున్నారు..
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!