పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన రీసెంట్ మూవీ సలార్.. గత ఏడాది డిసెంబర్ లో విడుదల అయిన ఈ సినిమా సాలిడ్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.. సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.700 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.. ఇక ఓటీటీలో కూడా మంచిది రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు టీవీలల్లోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
స్టార్ మా లో వచ్చే ఆదివారం 21 న ప్రసారం కానుందని తెలుస్తుంది.. ఆదివారం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు సలార్ సినిమా ప్రసారం కానుంది. మరి థియేటర్లో ఓటీటీలో సత్తా చాటిన ఈ చిత్రం టీవీలో ఎంత రేటింగ్ సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్ తో పాటుగా జగపతి బాబు వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు..
ఈ సినిమాను హోంబలే ఫిలింస్ నిర్మించగా, రవి బస్రూర్ సంగీతం అందించారు… సలార్ పార్ట్ 1 మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్.. ఇప్పుడు సలార్ పార్ట్ 2 ను కూడా తెరకెక్కిస్తున్నారు.. దీనితో పాటుగా కల్కి 2898 ఏడీ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత సలార్ 2 షెడ్యూల్ మొదలయ్యే అవకాశం ఉంది.. అంతేకాదు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ ప్రాజెక్టు కూడా ప్రభాస్ చేతిలో ఉంది. సందీప్ వంగా తో స్పిరిట్ సినిమా కూడా చేస్తున్నారు.. ఇవన్నీ పూర్తి చేశాకే కొత్త సినిమాలను అనౌన్స్ చెయ్యనున్నాడని సమాచారం..