Idupu Kayitham: డిసెంబర్ ఫస్ట్ వీక్ లో “ఇడుపు కాయితం” రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో విభిన్నమైన కంటెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే జీనియస్ డైరెక్టర్ సుకుమార్ (సుకుమార్ రైటింగ్స్), యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ (బన్నీ వాస్ వర్క్స్) సంయుక్తంగా సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా, యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “ఇడుపు కాయితం” అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేశారు. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం, ఇటీవలే వైభవంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా అనౌన్స్ అయిన అతి తక్కువ సమయంలోనే “ఇడుపు కాయితం” అనే విలక్షణమైన టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. అసలు ఈ టైటిల్ వెనుక ఉన్న నేపథ్యం ఏంటా అనే ఆసక్తి సినీ లవర్స్‌లో పెరిగిపోయింది. టైటిల్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ హైప్ తీసుకొచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా విపరీతమైన రెస్పాన్స్ దక్కింది.
ఈ సినిమాలో తెలంగాణ ప్రసిద్ధ ఫోక్ సాంగ్స్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ పై విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ప్రియదర్శి, నాగదుర్గల కాంబినేషన్‌తో పాటు ఈ చిత్రంలో ఒక హోమ్లీ స్టార్ కాస్టింగ్ ఉంది. శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఎలాంటి బ్రేకులు లేకుండా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి, ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో సినిమాను గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!