గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీన క్రెడిట్‌ను సిగ్గులేకుండా క్లెయిమ్ చేసుకునేందుకు తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలను వాస్తవాలు , గణాంకాలతో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియాతో విమర్శలు గుప్పిస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వ కృషి వల్ల సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల విలీనం కల సాకారమైందని కాంగ్రెస్ పేర్కొంది. ఎక్స్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ అధికారిక హ్యాండిల్ ఇలా అన్నారు: “రక్షణ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తులు ఫలించాయి.…
హైదరాబాద్ బంజారా లెక్ వ్యూ లో మన్ కీ బాత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తూట్లు పొడుస్తోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారిని చట్టాలకు పాతర వేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మోసపూరిత పార్టీలు.. రెండు పార్టీలు…
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో దీక్ష చేస్తున్న మోతిలాల్ నాయక్ కు మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో నిలబడి కొట్లాడిన వారు విద్యార్థులు అని ఆయన అన్నారు. గత అనేక సంవత్సరాలుగా తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగ యువత నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. గత పది సంవత్సరాలుగా గ్రూప్-1 ఎగ్జామ్స్ జరగలేదు. 10 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో…
భద్రాద్రి థర్మల్ పవర్ విద్యుత్ కేంద్రంలో పిడుగుపాటుకు పడటంతో ట్రాన్స్ఫారం పేలింది. దీంతో.. ట్రిప్ అయి మొదటి యూనిట్ నిలిచిపోయింది. భద్రాద్రి పవర్ ప్లాంట్ 1 యూనిట్ పై పిడుగుపాటు ప్రమాదం పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీస్తున్నారు. బీ.టీ.పీ.ఎస్ సీ.ఈ తో ఫోన్ లో మాట్లాడిన మంత్రి తుమ్మల.. పిడుగుపాటు ప్రమాద వివరాలు అధికారుల నుంచి తెలుసుకున్నారు. 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయినట్లు తెలుస్తోంది. జనరేషన్ ట్రాన్స్ ఫార్మర్…
తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కల్పనకు గణనీయ ప్రోత్సాహకంగా వరంగల్‌లో 300 పడకల సూపర్ స్పెషాలిటీ మెడికోవర్ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వైద్య రంగాన్ని విస్తరించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ హాస్పిటల్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్య, వైద్యం, విద్యుత్ అందుబాటులో ఉంటే విశ్వనగరంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందిందన్నారు సీఎం రేవంత్. ఫార్మారంగం…
ఖమ్మం జిల్లా ఎన్కూర్ మండలం ఇమామ్ నగర్ వద్ద సీతారామ ప్రాజెక్టు కెనాల్ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పరిశీలించారు. కెనాల్ పనులను పరిశీలించేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు బైక్ పై ప్రయాణించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. కెనాల్ పనులను రైతులు అడ్డుకోవద్దు మీ కాళ్లు పట్టుకుంటా అని ఆయన అన్నారు. సీతారామ కాలవ త్రవ్వటానికి 100 ఎకరాలు రైతులు ఇవ్వండని…
కేసీఆర్ ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్ కి పిలిస్తే ఒక్కరు పోట్లేదని, అందరూ ఢిల్లీకి పోతున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలకు బావ బామ్మర్ది తప్ప ఎవ్వరు మిగలరని, తీహార్ జైలులో ఉన్న కవిత అప్రోవల్ గా మారబోతున్నారని తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ కి వెళ్లి కవితను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఇంకా కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు. దేశంలో మొదటి…
సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే.. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం విషయంలో ఇష్టారీతిన అంచనా వ్యయం పెంచడంపై అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అప్రూవ్ లేకుండా రూ.1100 కోట్లున్న అంచనా వ్యయాన్ని రూ.1726 కోట్లకు ఎలా పెంచారని ప్రశ్నించారు సీఎం రేవంత్. కేవలం మౌఖిక ఆదేశాలతో రూ.626 కోట్ల వ్యయం ఎలా పెంచుతారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా అంచనా…
డిప్యూటి సీఎం మల్లు భట్టి విక్రమార్క రేపు ఖమ్మంలో జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి ఉదయం 7గంటలకు రోడ్డు మార్గాన ఖమ్మంకు బయలుదేరుతారు. ఖమ్మంకు చేరుకునే డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు జిల్లా అధికార యంత్రాగం, పార్టీ జిల్లా నాయకులు, శ్రేణులు స్వాగతం పలుకుతారు. ఉదయం 11గంటలకు ఆర్సిఎం చర్చ్ ఎదురుగా స్థంబాద్రి హస్పిటల్‌ను ప్రారంభిస్తారు. ఆక్కడి నుంచి చింతకాని మండలం గాంధినగర్ కు చేరుకొని రూ.175లక్షలతో గాంధీనగర్ నుంచి బొప్పారం వరకు రోడ్డు పనులకు…
సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకులు, పోలింగ్ బూత్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లతో కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బిజెపి కార్యకర్తలందరూ ఎంతో కష్టపడ్డారని, ఎన్నికల్లో నరేంద్ర మోదీ నీ బిజెపి ని ఓడించాలనీ దేశ వ్యాప్తంగా…