Cricket Stadium : తెలంగాణలో క్రికెట్‌కు కొత్త జోష్.. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో క్రికెట్‌కు కొత్త జోష్ రానుంది. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరుపనుంది. తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం కలుగనుంది. బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్ క్రికెట్‌కు రూట్ మ్యాప్.. బీసీసీఐ సహకారంతో రాష్ట్రంలో క్రికెట్ సర్వతోముఖాభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కొన్ని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ నియామకమయ్యారు. తెలంగాణ క్రికెటర్ల శ్రేయస్సు, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని హెచ్‌సీఏ క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్‌ను నియమించేందుకు ఆయనతో చర్చలు జరుపుతున్నామని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌కు తగ్గట్టు త్వరలో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరపనున్నామని, సర్కార్ భూమిస్తే సులభంగా కట్టవచ్చన్నారు.
అంతేకాకుండా.. ‘రెండు, మూడు జిల్లా కేంద్రాల్లోనూ స్టేడియాల నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నాం. టెండర్లు పిలిచి మహబూబ్‌నగర్ స్టేడియంలో టర్ఫ్ వికెట్, నిజామాబాద్ స్టేడియంకు చుట్టు ఫెన్సింగ్ వేయనున్నాం. జూలై 8 నుంచి డొమిస్టిక్ సీజన్ ప్రారంభం. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ షెడ్యూల్ ప్రారంభమవనుంది. అలానే మహిళల లీగ్ క్రికెట్‌ను కూడా ప్రారంభించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం. ఉప్పల్ స్టేడియంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మించే ప్రణాళిక. కొత్త కోచ్‌లు, అంపైర్లు, గ్రౌండ్స్‌మెన్, స్కోరర్ల ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టనున్నాం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న ఆడిట్లను ఆమోదించాం. ఇవి బీసీసీఐకి పంపిస్తే, బీసీసీఐ నుంచి రావాల్సిన పెండింగ్ నిధులు కూడా రిలీజ్ అవుతాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ఒక కమిటీని వేశాం. ఇందులో అపెక్స్ కౌన్సిల్ నుంచి ఒకరు, ఏజీ నుంచి ఒకరు, ఒక న్యాయవాది ఉంటారు. విచారించి, బిల్లులు చెల్లింపులు చేస్తారు..’ అని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు.
Also Read
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
తాజావార్తలు
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!