నవంబర్ 28, 2019న రాత్రి ఒక వెటర్నటీ డాక్టర్‌ను కిడ్నాప్ చేసి అత్యాచారం, హత్య చేశారో నలుగురు దుండగులు. దిశ పేరుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ఒక్కరోజులోనే పట్టుకొని విచారణ చేపట్టారు. అయితే 2019 డిసెంబర్ 6న దిశ కేసులో సీన్ రీ కన్స్ట్రాక్షన్ చేస్తుండగా పారిపోయేందుకు నిందితులు చెన్నకేశవులు, మహ్మద్ హారీఫ్, జొల్లు నవీన్, జొల్లు శివ ప్రయత్నించారు. అయితే ఈ నేపథ్యంలో దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగులు రాళ్లు రువ్వారు. అంతేకాకుండా పోలీసుల ఆయుధాలను లాక్కొని కాల్పులకు యత్నం చేశారు.
దీంతో పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు మరణించారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై నిందితుల కుటుంబాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు సిర్పూర్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసుపై రెండేళ్లుగా విచారణ సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు సిర్పూర్ కమిషన్ విచారణ చేసింది. అయితే నిన్న ఆదివారం ఎన్‌కౌంటర్ స్పాట్, దిశ డెడ్ బాడీ కాల్చిన ప్రదేశాలు కమిషన్ సందర్శించింది. ఎన్‌కౌంటర్ స్పాట్ వద్దకు చేరుకునే క్రమంలో షాద్‌నగర్ వద్ద కమిషన్ సభ్యులకు వ్యతిరేకంగా జనాలు రోడ్డుపై బైఠాయించి గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ నిందితుల కుటుంబాలకు మరింత భద్రతను పెంచారు.