సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ్ నేడు సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణ జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే సీజేఐ హోదాలో మొదటి సారి ఆయన స్వగ్రామానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆయనను ఎండ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లారు. అంతేకాకుండా కాకుండా ఆయన గ్రామస్థుల అభినందన సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీజేఐ సొంతూరు పర్యటనను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈ క్రింది లింక్‌ను క్లిక్ చేయండి.
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని పెద్దలు అన్న మాటను నిజం చేశారు ఈ అవిభక్త కవలలు. చేతులు, తలలు వేరుగా ఉన్నా కాళ్లు మాత్రం మొత్తం రెండు మాత్రమే ఉన్న ఈ అవిభక్త కవలలు.. తమ లోపానికి దిగులు చెందకుండా పట్టుదలతో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. పంజాబ్‌కు చెందిన సోనా సింగ్, మోనా సింగ్‌లు చిన్నప్పుడే జన్యుపరమైన లోపంతో జన్మించారు. అయితే వారు చిన్నప్పటి నుంచి పింగిల్వాడా అనే సంస్థలో పెరుగుతూ చదువుకున్నారు. అయితే వారిని…
ఏపీ టెకెట్ల ధరలపై రచ్చ జరుగుతూనే ఉంది. గత మూడు రోజులుగా ఏపీలోని సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి సరైన పత్రాలు లేని సినిమా హాల్‌లను మూసివేస్తున్నారు. అయితే విశాఖపట్నం జిల్లాలోని సినిమా థియేటర్లను కూడా నిన్నటి నుంచి తనిఖీ చేస్తున్నారు. ఈ రోజు కూడా జిల్లాలోని సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. నగరంలోని జగదాంబ, మెలోడీ థియేటర్ లలో ఆర్డీవో తో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో…
ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణలో మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. ఇటీవల తెలంగాణ మంత్రులు ఢిల్లీ పెద్దలను ధాన్యం కొనుగోళ్లపై కలిసేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మంత్రులను అవమాన పరిచి ఢిల్లీ నుంచి పంపితే భవిష్యత్ లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. జాతీయ పార్టీల నేతలు ఢిల్లీకి పైరవీ ల కోసం వెళతారు కానీ.. మేము తెలంగాణ ప్రయోజనాల కోసం వెళతామంటూ ఆయన వ్యాఖ్యానించారు. అడుక్కోవడానికి మేము…
రోజురోజుకు తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కరోనా కేసుల వైద్యం కోసం అదనపు పడకలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా దాని తీవ్రత తక్కువేనని ఆయన తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చిన తట్టుకొనే విధంగా 1400 పడకలు హైద్రాబాద్ లో ఏర్పాటు చేశామన్నారు. నిలోఫర్‌లో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6…
కరోనా రక్కసి కొత్త కొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే కరోనా డెల్టా వేరియంట్తో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ ఇప్పడు భారత్‌లో వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 358 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా తమిళనాడులో కూడా ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ ఉన్నతస్థాయి అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.…
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేటి నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కృష్ణా జిల్లాలోని ఎన్వీ రమణ సొంతూరైన పొన్నవరం రానున్నారు. గత రెండుసంవత్సరాల క్రితం జస్టిస్ ఎన్వీ రమన్ తన సొంతూరు వచ్చారు. అయితే తొలిసారి సీజేఐ హోదాలో స్వగ్రామానికి ఎన్వీ రమణ విచ్చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఆయనను పొన్నవరంలో ఎడ్లబండిపై ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్వీ రమణ స్వగ్రామానికి వస్తున్నందున గ్రామస్థుల అభినందన…
ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి బెడద 2 సంవత్సరాల నుంచి పోవడం లేదు. కరోనా కట్టడికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని తలచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం టీకాఉత్సవ్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో 130 కోట్లకు పైగా కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. అయితే తాజాగా తెలంగాణలో 100 శాతం తొలి డోస్ కోవిడ్ వ్యాక్సిన్ పూర్తైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా 61 శాతం మందికి రెండు…
అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. శబరిమలకు మరో 28 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. అయ్యప్ప భక్తులతో రైళ్లకు తాకిడి పెరగడంతో దక్షణిమధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. కాచిగూడ, హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడువనున్నట్లు తెలుస్తోంది. జనవరి…
సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టింది. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దళితబంధు లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం సమాచోనలు చేస్తోంది. ఈ క్రమంలో లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పరిమితి లేకుండా దళితబంధు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్…