హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి బర్త్‌డే పార్టీ ఫ్లెక్సీలను చిన్నపిల్లలతో కట్టించాడు. అయితే ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో ఇద్దరు చిన్నారులు కరెంట్‌షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు ఓ పిల్లవాడికి చేతులను తీసివేశారు. అయితే మరో పిల్లాడి కాళ్లు, పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పిల్లల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.