టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ ఆర్టీసీ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. కొత్తకొత్త ఆలోచనలతో ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపేందకు కృషి చేస్తున్నారు. అయితే సజ్జనార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న మహిళ కండక్టర్‌లకు రాత్రి 8 గంటల వరకే డ్యూటీలు వేయాలని అధికారులను ఆదేశించారు. రాత్రి 8 గంటలలోపే వారి డిపోలకు చేరుకునేలా డ్యూటీలు వేయాలని సూచించారు. అన్ని డిపోల మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు ఈ దేశాలను పాటించాలన్నారు.…
ఇప్పటికే డెల్టా వేరియంట్ సతమతమవుతున్న భారత్‌కు ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఈ వేరియంట్ క్రమక్రమంగా రాష్ట్రాలను ఆక్రమిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 89 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై నిషేధం విధించారు. అలాగే ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను…
ఏపీ సీఎం జగన్ ఈ రోజు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో రూ. 515 కోట్లతో మొత్తం 8 అభివృద్ధిపనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్ చనిపోయాక కడప జిల్లా జనం నన్ను గుండెల్లో పెట్టుకున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరులో 30 నెలల్లో ప్రజలకు 320 కోట్లు బదిలీ చేసామని, 22,212 మంది అక్క చెల్లెమ్మలకు…
న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్‌లో ఏదైనా…
పెరల్స్ చిట్‌ఫండ్ స్కాం కేసులో సీబీఐ 11 మందిని అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 11 మందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 5 కోట్ల మంది ఖాతాదారుల నుంచి రూ.60 వేల కోట్లు వసూలు చేసి మోసం చేసిందని గతంలోనే సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పెరల్స్ చైర్మన్ చంద్రభూషణ్, ప్రేమ్ సేత్‌తో పాటు మరో 9 మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2014లో పీజీఎఫ్‌తో పాటు పెరల్స్ గ్రూప్‌పై సీబీఐ…
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాన్ని ఈ క్రింది వీడియో లింక్‌లో వీక్షించండి..
రైతన్న దేశానికి వెన్నుముక అన్న మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం కూడా. అయితే దేశానికి వెన్నుముకలాంటి రైతన్న వెన్నులో వణుకుపుట్టించే విధంగా రాజకీయ పార్టీలు వాటి లబ్దికోసం రాక్షస క్రీడ ఆడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఆడే రాజకీయ రాక్షస క్రీడలో రైతన్నను పావుగా మారుతున్నాడు. మా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతాం.. నకిలీ విత్తనాలు, ఎరువులును ఆరికడతాం.. పంటకు మద్దతు ధర ఇస్తామంటూ…
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన రెండు బస్సు సర్వీసులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన బస్సు సర్వీసులో టికెట్ కొనుగోలు చేసి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి బస్సులో ప్రయాణించారు. పుంగనూరు పరిధిలోని ఎస్.అగ్రహారం, ఏ.కొత్తకోట మధ్య విద్యార్థులకు అనువైన సమయంలో బడిబస్సు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ప్రజల అవసరాల మేరకు పుంగనూరు నుండి మండల కేంద్రాల మీదుగా చిత్తూర్, అక్కడి నుండి చెన్నై కు…
నేటి అత్యాధునిక సమాజంలో టెక్నాలజీని మంచికి వాడేవారికంటే చెడుకు వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు మాత్రం చెడు దారుల్లో వెళుతున్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. షేట్‌బషీరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లు 7వ తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసు నిర్వహిస్తున్న సమయంలో, ఓ అగంతకుడు ఆ 7వ…
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్…