వరంగల్ నగరంలో అభివృద్ధి చేసిన ఉద్యానవనం భద్రకాళి ఫోర్‌షోర్ బండ్ అందాలు నగరవాసులనే కాకుండా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చే సందర్శకులను తన అందాలతో అదరహో అంటూ కట్టిపడేస్తుంది. వారాంతాలు, సెలవులు మరియు పండుగల సమయంలో, భద్రకాళి సరస్సు పరిసర ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. చారిత్రక భద్రకాళి సరస్సు వద్ద అభివృద్ధి చేసిన థీమ్ పార్క్ అందాలను చూసి సందర్శకులు మంత్ర ముగ్ధులలవుతున్నారు. ఇక్కడ కొలువు దీరిన భద్రకాళీ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన…
దేశంలో రోజు రోజుకు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారత్‌లో ఇప్పటికే 245 కేసులకుపైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి తీవ్రత మాత్రం పది రాష్ట్రాల్లోనే ఉండటంతో రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో ఈ బృందాలు పర్యటించి కేసులను అధ్యయనం చేయడంతో పాటు ఒమిక్రాన్ కేసుల రోజువారి నమోదు, కోవిడ్‌నిబంధనల అమలు వంటి వాటిపై ఈ బృందం…
విజయవాడలోని నొవాటెల్ హోటల్‌లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో సీజేఐ జస్టిస్ ఎన్వీరమణ పాల్గొన్నారు. హోటల్‌కు చేరుకున్న బిషప్‌లు, క్రైస్తవ మత పెద్దలు క్రిస్మస్ సందర్బంగా సీజేఐతో కేక్ కట్ చేయించారు. బిషప్‌లకు జస్టిస్ ఎన్వీరమణ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ తినిపించారు. వేడుకల్లో ఎపి, తెలంగాణ హైకోర్టు సీజేలు .. జడ్జిలు తదితర ఉన్నతాధికారులు పాల్గన్నారు. మరోవైపు నోవాటెల్ హోటల్‌లో ఉన్న సీజేఐని కలిసేందుకు ప్రముఖులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. సీజేఐ రాష్ర్ట పర్యటనలో ఉన్న సంగతి…
హైదరాబాద్ : హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్డేడియంలో నిర్వహిస్తున్న బుక్ ఫెయిర్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందర్ని ఆకర్షిస్తుంది ప్రముఖులుసైతం బుక్ ఫెయిర్‌కు హాజరవుతున్నారు. తాజాగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పుస్తక పఠనం వల్ల ఆలోచన, మేధస్సు పెరుగుతుందన్నారు. పిల్లలు తమ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదవాలన్నారు. ఈ సందర్భంగా పబ్లికేషన్ డివిజన్ అధికారులను…
తెలంగాణ బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ అసహానం వ్యక్తం చేశారు. తాము ఎవ్వరిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం లేదని అలాంటప్పుడు కుటుంబ సభ్యులను ఇందులోకి లాగి ఇబ్బందులకు గురి చేయడం ఏంటని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం ఏంటని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు శరీరంలోనా..? అంటూ తీన్మార్ మల్లన్న పోల్ నిర్వహించడం పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఫిర్యాదు…
తెలంగాణ విద్యుత్ చార్జీల పెంపుపై తెలంగాణ రాష్ర్ట విద్యుత్ నియంత్రణ మండలి (TSERC) చైర్మన్ శ్రీరంగారావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. డిస్కంలు టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకపోతే, సుమోటోగా తీసుకొని విద్యుత్ ఛార్జీలు పెంపు పై చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎవరికీ నష్టం జరగకుండానే విద్యుత్ ఛార్జీల పెంపు ఉంటుందని తెలిపారు. సరైన సమయానికి విద్యుత్ డిస్కంలు, ఏ ఆర్ ఆర్ సమర్పించక పోవడంతో గతంలో ఇచ్చిన వాటిని…
జన్మదిన వేడుకల్లో ఇద్దరి స్నేహితుల మధ్య గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై ఒకరూ బీరు బాటిళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సాయి రెడ్డి అనే యువకుడిని తోటి స్నేహితుడు బీరు సీసాలతో కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎల్లమ్మ బండలో నివసించే శివ తన జన్మదిన వేడుకలను అంబీర్ చెరువు కట్ట కింద గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి నిర్వహించాడు.…
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేడు ఆయన సొంతూరులో పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని పొన్నవరం ఆయన స్వగ్రామం. అయితే ఆయనను గ్రామస్థులు ఎడ్లబండిపై ఊరేగింపు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సమేతంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్థుల అభినందన సభలో మాట్లాడుతూ.. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మర్చిపోను.. నేను పుట్టిన ఊరంటే నాకు చాలా ఇష్టమని ఆయన అన్నారు. చిన్నతనంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1967లోనే రాజకీయంగా చైతన్యమైన గ్రామం మాది.…
హైదరాబాద్‌లోని నిజాంపేట్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడి బర్త్‌డే పార్టీ ఫ్లెక్సీలను చిన్నపిల్లలతో కట్టించాడు. అయితే ఫ్లెక్సీలను కడుతున్న సమయంలో ఇద్దరు చిన్నారులు కరెంట్‌షాక్‌కు గురయ్యారు. దీంతో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు ఓ పిల్లవాడికి చేతులను తీసివేశారు. అయితే మరో పిల్లాడి కాళ్లు, పొట్టభాగంలో తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. పిల్లల పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.…
ఆదాయం పన్ను నుంచి తప్పించుకునేందు కొంతమంది తప్పుడు దారులను అన్వేషిస్తున్నారు. తీరా అధికారుల సోదాల అసలు విషయం బయట పడడంతో జైలు పాలవుతున్నారు. అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత, వ్యాపారి పీయూష్ జైన్ తన వ్యాపారంలో వచ్చిన ఆదాయంపై పన్ను ఎగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లులు సృష్టించాడు. అంతేకాకుండా వాటిని ఉపయోగించి అధికారులను బురిడి కూడా కొట్టించారు. ఆ తరువాత అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేయగా…