ఇప్పటికే ఆనారోగ్యంతో బాధపడుతున్న బీసీసీఐ చీఫ్ గంగూలీకి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయనను కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు ఈ ఏడాది జనవరిలో గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పడు వైద్యులు గంగూలీ హార్ట్‌లో మూడు బ్లాక్స్‌ను గుర్తించి వెంటనే చికిత్స చేశారు. దీంతో గంగూలీకి ప్రాణాపాయం తప్పింది. అయితే ఇప్పుడు ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీమిండియాకు కెప్టెన్‌గా బాధ్యత వహించిన గంగూలీ.. ఎన్నో రికార్డులు సృష్టించారు.