దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లో కూడా ఒమిక్రాన్ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే సతమతమవుతున్న ప్రజలకు ఇప్పడు ఒమిక్రాన్ మరింత భయాన్ని రేపుతోంది. డెల్టా వేరియంట్ కంటే 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలను తారుమారు చేస్తూ మరింత శరవేగంగా ఒమిక్రాన్ వ్యాపించడం ఆందోళన కలిగించే విషయం. కేంద్ర…
రోజురోజుకు భారత్‌లో కోవిడ్ విజృంభన పెరిగిపోతోంది. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో పాటు తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను తీవ్రతరం చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కరోనా కట్టడికి రెండు…
నేడు నల్గొండ జిల్లాలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి లు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటలకు నల్లగొండకు చేరుకుంటారు. వారికి బైక్ ర్యాలీలతో టీఆర్‌ఎస్ శ్రేణులు స్వాగతం పలుకనున్నారు. ఉదయం 10:45 నిమిషాలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సీ,ఎస్టీ హాస్టల్ ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ…
రాజేంద్రనగర్ అత్తాపూర్ లో ఇద్దరు మైనర్ అమ్మాయిల మిస్సింగ్ మిస్టరీగా మారింది. వేరు వేరు ప్రాంతాలలో ఇద్దరు విద్యార్థినీలు అదృశ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే టైలరింగ్ నేర్చుకోవడానికి ఓ విద్యార్ధిని వెళ్లగా స్కూల్ కు మరో విద్యార్ధిని వెళ్లింది. అయితే ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లిన విద్యార్థినీలు సాయంత్రం ఎంతకీ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టూ పక్కల వెతికి, సమీప బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా ఫలితం లేకపోయింది.…
తూర్పుగోదావరి జిల్లా కడియంలో రెండు తలలతో గేదెదూడ జన్మించింది. అనంతరం 1 గంటలోపే మరణించిన సంఘటన మండలంలోని మురమండ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన పాడిరైతు తూలూరి వీరకాసు మకాంలో నిన్న రాత్రి ముర్రా జాతి గేదెకు రెండు తలల లేగదూడ జన్మించింది. ఈ వార్త ఆ నోటా ఈ నోటా గ్రామమంతా వ్యాపించింది. గ్రామ ప్రజలు లేగదూడను చూసేందుకు ఎగబడ్డారు. ఇంతలోనే ఆ దూడ మరణించడంతో నిరుత్సాహపడ్డారు. జన్యులోపంతో బహు అరుదుగా ఇలాంటి లేగదూడలు జన్మిస్తాయని…
సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు రేవంత్ రెడ్డి వరంగల్‌లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని కోసం ఉదయం ఆయన సిద్ధంకాగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత సోమవారం కూడా రేవంత్…
కీసరలోని సాయిధామం ఆశ్రమం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామనందప్రభు స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి అకస్మాత్తుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ ఓనర్ సాయిధామం ఆశ్రమ భూమిని కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారని, అందుకు అడ్డుపడుతున్నందుకే స్వామీజీపై ఈ వేధింపులా అంటూ భక్తులు మండిపడుతున్నారు. అక్రమార్కులకు పోలీసులు కొమ్ము కాస్తున్నారంటూ ఆశ్రమ సభ్యులు, హిందూ సంఘాల నాయకుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామిజీని విడుదల చేయాలంటూ ఆందోళన…
కరోనా మహమ్మారి విజృంభన మరోసారి కొనసాగుతోంది. కరోనా డెల్టా వేరియంట్‌కు తోడు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ సైతం దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. అయితే గత 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 18.16 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికాలో 5.37 లక్షల కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో అమెరికాలో 1300 మందికిపైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో సైతం…
గత నెల క్రితం వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీవర్షాలతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చెన్నై, కాంచీపురం తిరువళ్లూరు, చింగ్లెపేట్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో చైన్నైలో ఫ్లడ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సీఎం స్టాలిన్…
గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల మధ్య పీఆర్సీకి సంబంధించి చర్చలు జరుగుతునే ఉన్నాయి. పీఆర్సీ విషయంలో అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు పొత్తు కుదరడం లేదు. దీంతో ఈ అంశం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. తాజాగా జరిగిన చర్చల అంశాలను ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర విభజన నుంచి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి వరకు అధికారులు మాకు వివరించారన్నారు. ఇక ముందు చర్చలకు…