రాష్ట్ర ప్రజలు కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలతో ఉండాలని ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ బాధ్యత ఈ ఏడాది నుంచి మరింతగా పెరుగుతుందన్నారు. వైసీపీ పాలనకు 30 నెలలు పూర్తియిందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కోవిడ్ తీవ్రంగా ఉన్నప్పటికీ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ వందకు వందశాతం పూర్తి చేశామని పేర్కొన్నారు. క్యాలెండర్ డేట్స్‌తో సహా అన్ని పథకాలను చెప్పినవాటి చెప్పినట్టుగా పూర్తి చేశామన్నారు. Read Also:ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సజ్జనార్…
తెలంగాణ ప్రజలకు మంత్రి జగదీశ్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలకు అందరూ దూరంగా ఉండి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆరోగ్యంగా ఉంటే ఏడాదంతా వేడుకలు చేసుకోవచ్చని తెలిపారు. ఒమిక్రాన్ వేరింయంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలను ఇళ్లలోనే నిర్వహించుకోవాలని మంత్రి ప్రజలను కోరారు. Read Also:చాదర్‌ఘాట్‌లో ఘోర అగ్ని ప్రమాదం ఆరోగ్యాలను కాపాడుకోవడానికి అందరూ ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. ప్రాణాలు విలువైనవని అందుకే వేడుకల పేరుతో ఎవ్వరు ప్రాణాల…
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి తెలంగాణలో ఎలాంటి మతపరమైన హింసాకాండగానీ, మరే ఇతర ప్రధాన శాంతిభద్రతలుగానీ చోటుచేసుకోలేదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి (డీజీపీ) అన్నారు. శుక్రవారం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నేరాల రేటును ఆయన వివరించారు. నిర్మల్ జిల్లా భైంసాలో గత ఏడేళ్లలో జరిగిన చిన్న చిన్న ఘటనలు తప్ప పెద్దగా ఎలాంటి మత ఘర్షణలు రాష్ర్టంలో చోటు చేసుకోలేదని ఆయన…
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలని పదే పదే చెబుతున్నామని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది అంతర్గత కమిటీల ఏర్పాటు లక్ష్యంగా కమిషన్ పని చేస్తుందని, మహిళా కమిషన్ ఈ రెండున్నర సంవత్సరాల్లో వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్, చిన్నారులపై అత్యాచారాలు పైనా ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆమె తెలిపారు. అంతేకాకుండా కొన్ని కేసుల్లో మహిళా కమిషన్ జోక్యంతోనే అరెస్టులు జరిగాయన్నారు.…
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఈ వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,270కు చేరుకుంది. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. చీరాల మండలం పేరాలలో ఇటీవల దుబాయ్ నుండి వచ్చిన ఓ కుటుంబంలో 50 ఏళ్ల మహిళకు ఒమిక్రాన్ గా నిర్ధారణైనట్లు వైద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కుటుంబ సభ్యులకు…
ఇటీవల వంగవీటి రాధా తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారంటూ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పెను దుమారం రేపాయి. దీంతో రాధా అంశంపై స్పందించిన బెజవాడ సీపీ క్రాంతి రానా మాట్లాడుతూ.. రాధా రెక్కీపై నిర్దిష్ట ఆధారాలు దొరకలేదని ఆయన వెల్లడించారు. రాధా భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామని, మాకు రాధా రెక్కీపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఆయన అన్నారు. అంతేకాకుండా 2 నెలల సీసీ టీవీ ఫుటేజ్ ను ప్రస్తుతం పరిశీలిస్తామని, ఘటనపై పూర్తి స్థాయి…
2021 ముగింపు సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు కోవిడ్ సమయంలో ప్రజలతో పాటు అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేస్తూ పనిచేశారన్నారు. తెలంగాణలో పోలీసులపై ప్రజలకు మరింత నమ్మకం కుదిరిందని,ఈ సంవత్సరం మొత్తం ఎక్కడా శాంతిభద్రతల సమస్య రాలేదని ఆయన అన్నారు. మావోయిస్ట్ సమస్య రాష్ట్రంలో పునరావృతం కాకుండా పోలీస్ శాఖ సక్సెస్ అయ్యిందని, తెలంగాణను మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా ఉంచేందుకు పోలీస్ శాఖ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బృందం గవర్నర్ తమిళసైని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై ఈ సందర్భంగా గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 317 జీఓ ని సవరించాలన్నారు. ఈ జీఓ లో తమకు అనుకూల మైన వారిని ఇష్టమొచ్చిన చోట కేటాయించుకునే ఆప్షన్ ఉందన్నారు. సీఎం వెంటనే ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంకా…
తెలంగాణలో ఉద్యోగుల బదిలీపై గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తెలంగాణ గవర్నర్ తమిళసైని కలిసి ఈ రోజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, టీచర్ల సమస్యలు, 317 జీవో పునఃసమీక్షపై గవర్నర్‌తో బండి సంజయ్ బృందం చర్చించింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం బిజీ గా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.. అందుకే గవర్నర్ ని కలిసామని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినప్పుడే…
ఇటీవల విడుదలైన పుష్ఫ సినిమాలు అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పుష్పరాజ్ అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కస్టమ్స్ శాఖలో పని చేస్తున్న ముగ్గురు పుష్పరాజ్ అవతారం ఎత్తారు. బాధ్యతయుతమైన పోస్టుల్లో ఉండి ఎర్రచందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు ఆ అధికారులు.. సీబీఐ చొరవతో ఆ అధికారులు గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులు ఓ ముఠాతో కలిసి ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు తెరలేపారు. దీంతో కస్టమ్స్ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.…