గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. గుడివాడలో అసలు క్యాసినో నిర్వహణ జరగలేదని ఆయన అన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే కోడి పందాలు, పేకాట శిబిరం మాత్రమే జరిగాయని, కొడాలి నాని అనారోగ్యంతో ఉండటంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు నా స్నేహితులు, వారు ఎవరో కూడా కొడాలి నానికి తెలియదని, అది…
పీఆర్సీపై ఏపీలో పెను దుమారం లేస్తోంది. ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్ధం చేసుకోవాలని అధికార వైసీపీ నేతలు అంటుంటే.. ఇలాంటి పీఆర్సీని చరిత్రలో చూడలేదంటూ ఉద్యోగులువాపోతున్నారు. 11వ పీఆర్సీని రద్దు చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు హై కోర్టు ను ఆశ్రయించారు. ఈ క్రమంలో పీఆర్సీ జీవోలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై నేడు ఏపీ…
గుడివాడ క్యాసినో ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. విపక్షాలు గుడివాడ ఘటనపై విమర్శలు గుప్పిస్తుంటే.. అధికార వైసీపీ నేతలు మాత్రం గుడివాడలో ఎలాంటి క్యాసినో జరగలేదని, విపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినో వివాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. క్యాసినో ఎక్కడ జరిగినా జరిగింది వాస్తవమా కాదా?…
నేటి యువత మద్యానికి బానిసై తమ నిండు జీవితాలను అంధకారమయం చేసుకుంటున్నారు. మద్యం మత్తులో కన్నుమిన్ను తెలియక అనర్దాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు. అయితే పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న యువత మారడం లేదు. మద్యం మత్తులో సుబర్నా పాండే అనే యువతి వీరంగం సృష్టించిన ఘటన తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగి తో సుబర్నా పాండే దురుసుగా…
గత రెండు సంవత్సరాలు పట్టిపీడిసున్న కరోనా మహమ్మారి మరో సరి విజృంభిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా భారీగా నమోదవుతున్నాయి. అయితే ఒమిక్రాన్ ప్రభావం ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఉండడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కోవిద్ నిభందనలు కఠిన తరం చేయడమే కాకుండా. నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తున్నాయి. అయితే…
ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కూడా పలుచోట్ల జోరు వాన కురిసింది. ఇలా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆదివారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రోడ్లపైకే కాదు ఇళ్లలోకి కూడా నీరు చేరాయి. అంతేకాదు పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరడంతో సిబ్బంది, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్నటి నుంచి ఆగకుండా వర్షం కురుస్తుండటంతో ఆఫీసు అంతా మునిగి పోయి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.…
హీరో సూర్య నటించిన “వీడొక్కడే” సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో హెరాయిన్ స్మగ్లింగ్ చేసేందుకు హీరో సూర్య స్నేహితుడు చేసిన విధంగానే ఓ మహిళ చేసి ప్రాణాల మీదికి తెచ్చుకుంది.. వివరాల్లోకి వెళితే.. ఉగాండా దేశానికి చెందిన ఓ మహిళ ఢిల్లీ ఐ పోర్టుకు చేరుకుంది. ఎయిర్‌పోర్ట్ లో సదరు ప్రయాణికురాలి పై అనుమానం కలగడంతో కస్టమ్స్ బృందం అదుపులోకి తీసుకొని విచారణ చేసింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిన ప్రభుత్వాలు 2001లో రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రేరేపించాయి. స్వరాష్ట్రం వచ్చిన తరువాత తెలంగాణపై ఆంధ్రా నాయకుల రాజకీయ ఆధిపత్యం అంతరించి, కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందడం ప్రారంభమైంది. కానీ, తెలంగాణకు జరిగిన అన్యాయం నేటికీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ అన్ని రంగాలలో అపూర్వమైన పురోగతిని సాధించింది. కొత్త రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన సహాయాన్ని కేంద్రప్రభుత్వం అందజేసి ఉంటే ఇప్పటికి తెలంగాణ ఊహించని విధంగా పురోగతి సాధించేది. కేంద్ర ప్రభుత్వం…
నేటి సమాజంలో చిన్నాపెద్ద తేడాలేకుండా.. ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ఎన్ని చట్టాలు చేసిన.. ఎంత భయంకరంగా శిక్షించినా కామాంధులు మారడం లేదు. అన్యంపుణ్యం తెలియని చిన్నారులను సైతం కామాంధులు విడిచిపెట్టడం లేదు.. మృగాళ్లు చిన్నారులపై పడి విచక్షణ రహితంగా తమ కామ వాంఛ తీర్చుకుంటున్నారు. సమాజంలో ఆడపిల్లల బతుకు ప్రశ్నార్ధకంగా మారింది. ఇదిలా ఉంటే.. ప్రేమ పేరుతో ఓ వివాహితుడు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని వేధింపులకు గురి చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది.…
స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని గోషామహల్ ఎమ్మెల్యే, శాసనసభలో బీజేపీ ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ ఆదివారం పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నేతాజీ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అనేక స్వాతంత్ర్య పోరాటాలు చేపట్టారని, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి అనేకమంది స్ఫూర్తినిచ్చారన్నారు. దురదృష్టవశాత్తూ ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధులను ప్రజలు మరిచిపోయేలా చేసింది కాంగ్రెస్’ అని రాజా సింగ్ ఆరోపించారు.…