భారత రాజ్యాంగాన్ని తిరగరాయడంపై తాను చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంత రావు గురువారం అల్టిమేటం ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు వీహెచ్ మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వం దళితుల కుటుంబానికి 10 లక్షలు ఇస్తుందని చెప్పారు. వారు అణగారిన వారు మరియు సంవత్సరాలుగా బానిసలుగా ఉన్నందున అతను ఇస్తున్నాడు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని రచించారు.…
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలలో సాయంత్రం 6 గంటల నుంచి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో పలు చోట్ల అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, ప్రకాశం జిల్లా చీరాల, ప.గో. జిల్లా భీమవరం, కాకినాడ, అమలాపురం, తుని, సీతానగరం, రామచంద్రాపురం, తొండంగి, అనపర్తి, పెద్దాపురంలో సాయంత్రం 6 గంటల నుంచి మూడు గంటలకు పైగా విద్యుత్ సరఫరా…
సంక్రాంతి సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని క్యాసినో నిర్వహించారని రెండు రోజులుగా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గుడివాడలో క్యాసినో వ్యవహారంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. గుడివాడ ఆధునీకరణకు శ్రీకారం చుట్టిన మంత్రి కొడాలి నానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని… క్యాసినోకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారంతా పూర్వీకులు అని.. వారికేం తెలియదని వర్మ సెటైర్లు…
దేశంలో అధికారుల లెక్కల కంటే కరోనాతో మరణించిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని తెలుపుతున్నాయి. కరోనాతో మరణించిన ప్రతి బాధిత కుటుంబానికి రూ.50 వేల పరిహారం చొప్పున ఇవ్వాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న సమయంలో… పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలపై నివేదికలను సమర్పించాయి. ఈ నివేదికల ద్వారా కరోనా మరణాల సంగతి వెలుగులోకి వచ్చింది.…
శ్రీకాకుళం జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. మంగళవారం అర్ధరాత్రి గార మండలం రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణమూర్తిని హత్య చేసేందుకు గుర్తుతెలియని వ్యక్తులు ప్రయత్నించారు. ఈ మేరకు సర్పంచ్‌పై కాల్పులు జరిపారు. వివరాల్లోకి వెళ్తే… మంగళవారం రాత్రి మరురానగర్‌లోని సర్పంచ్ కార్యాలయానికి ఆదివారంపేటకు చెందిన ఓ మహిళ వెళ్లింది. తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను కూడా సదరు మహిళ సర్పంచ్ దగ్గరకు తీసుకెళ్లింది. Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు…
కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల పరిధిలో ఈనెల 30వరకు నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షల కొత్త షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్‌లో చూడొచ్చని అధికారులు సూచించారు. Read Also: స్కూళ్ళు, కాలేజీలు సరే.. వాటి సంగతేంటి? మరోవైపు తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలు విద్యార్థులకు సంక్రాంతి సెలవులను…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య (88) అనారోగ్యంతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఒక్కసారిగా ఆయనకు బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించే లోపే మార్గం మధ్యలో రోశయ్య చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రోశయ్య గతంలో తమిళనాడు గవర్నర్‌గా పని చేశారు. అయితే కొన్నాళ్లుగా రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత సెప్టెంబర్ 3, 2009 నుంచి జూన్ 25, 2011…
టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి 8 గంటలకు కన్నుమూశారు. కొద్దిరోజుల కిందట ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. 75శాతం ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. శివశంకర్ మాస్టర్ కుటుంబం ఆర్ధిక పరిస్థితి బాగోకపోవడంతో నటుడు సోనూసూద్, తమిళ హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సహాయం అందించారు.…
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పోలీసులు జరిపిన ఎనకౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్‌లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మావోయిస్టులు చనిపోయిన విషయాన్ని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ ధృవీకరించారు. కాగా గడ్చిరోలి జిల్లా ధనిరా తాలూకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం.…