Chandrayaan-3: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్-3 మిషన్ నిర్వహించబోతోంది. రేపు ఎల్వీఎం-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 జాబిల్లి వైవపు ప్రయాణించనుంది. ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే చంద్రయాన్-2లో జరిగిన తప్పులు మళ్లీ పునారావృతం కాకుండా శాస్త్రవేత్తలు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వైఫల్యాన్నే విషయంగా మార్చుకునేందుకు ఇస్రో చంద్రయాన్-3 ప్రారంభించింది. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ దిగితే, ఈ ఘటన సాధించిన అతికొన్ని దేశాలైన అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ సగర్వంగా నిలబడుతుంది. అయితే…
Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.