సౌదీ అరేబియా డ్రీమ్ ప్రాజెక్టు నియోమ్. ఆ ప్రాజెక్టుకు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే చంపేయమని చెప్పింది.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీద నుంచి వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే ముగ్గురు ప్రాణాలు వదిలారు.
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
2 దశాబ్దాలుగా బనగానపల్లె నియోజకవర్గం ప్రజల సేవకు టీడీపీ అంకితమైన కుటుంబం.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి కుటుంబం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి సర్పంచ్‌గా బనగానపల్లె పట్టణ అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించారు. వ్యాపార వేత్తంగా పేరుగాంచిన బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే కరువు ప్రాంతమైన బనగానపల్లెలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకున్నారు. 2014 లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన తొలిసారే సిట్టింగ్…
ఉద్యోగాల భూ కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి (Rabri Devi), ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లు శుక్రవారం ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఆయన రైతులకు పట్టాలు అందించనున్నారు.. ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. 2003కు ముందుకు సంబంధించిన అసైన్డ్‌భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్డ్ భూములకు పట్టాల పంపిణీ చేయనున్నారు.
బీహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Bombay Dyeing Land Deal: దేశ ఆర్థిక రాజధాని ముంబై చరిత్రలోనే అతిపెద్ద ల్యాండ్ డీల్ జరిగింది. వర్లీలోని ఈ భూమిని విక్రయించడం ద్వారా బాంబే డైయింగ్‌కు రూ.5200 కోట్ల ఆదాయం సమకూరనుంది.
ఇండిగో విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన్యం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో సంస్థ తెలిపింది.