హైదరాబాద్‌లో కబ్జారాయుళ్లు హడలెత్తిస్తున్నారు. ఖాళీ స్థలాల కనిపిస్తే చాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలాలను కోట్ల రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. అలాంటి ఓ గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. పేదలు, మధ్యతరగతి ఆస్తులే టార్గెట్‌గా కబ్జాలు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలా ఆక్రమించేస్తున్నారు. విలువ పెరిగితే భూములు అమ్ముకుందామనుకున్న వాళ్లను నిలువునా ముంచేస్తున్నారు. ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనకంటూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ ఉంటారు జనం.…